out sourcing employees
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
-
AP: విద్యుత్‌శాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. ఇది కూడా చదవండి: పుంగనూరు అల్లర్లపై నేడు హైకోర్టులో విచారణ.. చంద్రబాబే ఏ1.. -
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. అయినా రోడ్డున పడేశారు..
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రిలోని నాలుగో తరగతి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వాపోయారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి తమ మొర వినిపించారు. గాంధీ ఆసుపత్రిలో సేవలందించేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని, తాము ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు. కష్టకాలంలో అందించిన సేవలను మరిచి ఇప్పుడు తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరున ఉద్యోగాలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు. చదవండి: వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల సవరణ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల ప్రకారం చెల్లింపులను ఆర్టీసీ ఖరారు చేసింది. తాత్కాలిక ఉద్యోగులందరికీ కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకనుగుణంగా కార్మికశాఖ ఈ కనీస వేతనాలను సవరిస్తుంటుంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణం చూపుతూ ఆర్టీసీ కనీసవేతనాలను సవరించటం లేదు. తాజాగా వాటిని సవరిస్తూ ప్రస్తుతం అమలులో ఉన్న స్థాయిలో వాటిని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో వివిధ కేటగిరీలకు సంబంధించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 2,700 మంది ఉన్నారు. వీరందరికీ నవంబరు నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సఫాయీ కర్మచారీ విభాగానికి సంబంధించి జోన్–1లో రూ.12,059గా ఉన్న మొత్తాన్ని రూ.13,952కు, జోన్–2లో రూ.11,799 నుంచి రూ.13,692కు, జోన్–3లో రూ.11,599 నుంచి రూ.13,492కు పెంచారు. సెక్యూరిటీ విభాగంలో ఇన్స్పెక్టర్లకు ఇవే జోన్ల పరిధిలో వరుసగా రూ.11,772–రూ.13,284,10,772–12,284, రూ.9,522–రూ.11,034, సెక్యూరిటీ గార్డుకు రూ.10,272–రూ.11,784, రూ.9,522–రూ.11,034, రూ.9,272–రూ.10,784, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి అన్‌స్కిల్డ్ రూ.9,011–రూ.10,478, సెమీ స్కిల్డ్ రూ.10,640–రూ.12,376,స్కిల్డ్ రూ.13,057–రూ.15,185, డాటా ఎంట్రీ ఆప రేటర్లు రూ.9,826–రూ.11,427, అటెండర్లు రూ.9,011–రూ.10,478గా ఖరారు చేశారు -
TS: ఔట్‌సోర్సింగ్‌లో అధ్యాపకులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలోనే ఈ తరహా నియామకాలు జరుగుతున్నాయా? దేశంలో మరెక్కడైనా ఇలా చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులను రెగ్యులర్ పద్ధతిలో నియమిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించి ఉన్న నియమ నిబంధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక, పాఠశాల, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శులతోపాటు జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్లను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే నియామకాలు చేస్తుండటంతోపాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ‘కరోనాతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది అధ్యాపకులను తొలగించగా... విధులు నిర్వహిస్తున్న వారికీ వేతనాలు ఇవ్వడం లేదు’ అని శ్రవణ్‌కుమార్ లేఖలో పేర్కొన్నారు. తమ గుర్తింపు ఉన్న కళాశాలల్లో అధ్యాపకుల నియామకాలకు ఓ ప్రత్యేక కమిటీ ఉంటుందని జేఎన్టీయూ తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకుంటున్న చర్యలతోపాటు, అధ్యాపకుల నియామకాలకు సంబంధించి ఉన్న నియమ నిబం ధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. -
ఇంటి దొంగల బాగోతం బట్టబయలు
అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురంలోని సెంట్రల్ కంప్యూటర్ ల్యాబ్‌లో 24 ఇన్వర్టర్ల బ్యాటరీలను తరలిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం పట్టుబడ్డారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ కంప్యూటర్ ల్యాబ్‌లో వందలాదిగా కంప్యూటర్లు, ఇన్వర్టర్లు ఉన్నాయి. ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీటిని ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నారు. సెంట్రల్ ల్యాబ్ తాళాలను పోలిన తాళాలను తయారు చేయించారు. కళాశాల తెరవక ముందే మరో తాళం చెవితో తలుపులు తీసి రోజూ రెండు ఇన్వర్టర్లను తీసుకెళ్లారు. ఇదే తరహాలోనే శుక్రవారం తాళం వేసినట్లుగానే ఉంది. కానీ ఇన్వర్టర్లను తీసుకెళ్తున్న వైనంపై సెంట్రల్ ల్యాబ్ పక్కన ఉన్న కోవిడ్ సెంటర్లో ఉంటున్న బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు పంపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కళాశాలకు వచ్చి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా ఇంటి దొంగల బోగోతం బట్టబయలైంది. ఇటీవల 24 కొత్త ఇన్వర్టర్ల బ్యాటరీలను బై బ్యాక్ ఆర్డర్ ఇచ్చారు. బై బ్యాక్ అంటే పాతవి వెనక్కి తీసుకొని కొత్త ఇన్వర్టర్లు ఇస్తారు. దీంతో పాత ఇన్వర్టర్ బ్యాటరీలన్నీ ఒకేచోట ఉంచారు. వీటిని రోజూ తీసుకెళ్తూ చివరి రోజు దొరికిపోయారు. ఈ వ్యవహారంపై జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు కంప్యూటర్ సైన్సెస్ విభాగాధిపతి తెలిపారు. కలికిరిలోనూ నాలుగు ల్యాప్‌టాప్‌లు మాయం .. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలోనూ నాలుగు హైకాన్ఫిగరేషన్ గల ల్యాప్‌టాప్ కంప్యూటర్లు మాయమయ్యాయి. ఒక్కో ల్యాప్‌టాప్ రూ. లక్ష విలువ చేస్తాయి. మొత్తం రూ.4 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు దసాల్ట్ ల్యాబ్‌లో కనిపించలేదనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే విచారణకు ఆదేశించారు. -
సుమతి ఏజెన్సీ సర్వీసెస్‌పై గవర్నర్ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ సుమతి ఏజెన్సీ సర్వీసెస్ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. 20 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన సుమతి ఏజెన్సీ సంస్థ మేనేజర్ మునిశంకర్‌పై బాధితులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఈ ఉద్యోగాల అవకతవకలపై కార్యదర్శితో కమిటీ వేశారు. ఉద్యోగాల పేరిట వసూళ్లు నిజమేనని కమిటి నివేదిక ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను గవర్నర్ ఆదేశించారు. అక్రమదందాకు తెరలేపిన సుమతి సంస్థ మేనేజర్ మునిశంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మ గుడిలో అన్నీ..అవకతవకలే
సాక్షి, అమరావతి: ఎలాంటి అనుమతులు లేకుండానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకంలోనూ ఇదే పరిస్థితి. ప్రసాదాల పేరిట రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయి. చివరకు అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి. బెజవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారాలపై దేవదాయ శాఖ కమిషనర్ పద్మ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలివి. తెలుగుదేశం పార్టీ హయాంలో.. గడచిన ఏడాది కాలంలో విజయవాడ దుర్గ గుడిలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఒక పోస్టులో ఉండే అధికారి బదిలీపై వెళ్లి.. మరొకరు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన అధికారి అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారికి నివేదిక ఇవ్వడం అనవాయితీ. 2018 ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 22 వరకు దుర్గ గుడి ఈవోగా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి వి.కోటేశ్వరమ్మ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టిన దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్ తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో గుర్తించిన లోపాలు, అవకతవకలపై దేవదాయ శాఖ కమిషనర్‌కు సమాచారమిచ్చారు. కమిషనర్ వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతూ.. చర్యలు తీసుకోవడానికి తగిన సూచనలు చేయాలని కోరారు. నివేదికలో పేర్కొన్న అవకతవకల వివరాలివీ.. ►2018 దసరా ఉత్సవాల నాటినుంచి 2019 సెప్టెంబర్ వరకు ఆలయంలో అప్పాలు ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసినందుకు రూ.1.21 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు. అయితే, ఆలయంలో అప్పాలు ప్రసాదం పంపిణీకి ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ►రికార్డుల్లో పేర్కొన్న చీరల ధరలకు, గోడౌన్లలో ఉంచిన చీరల ధరలకు మధ్య చాలా తేడాలున్నాయి. అమ్మవారి చీరల విషయంలోనే ఆ ఏడాది కాలంలో రూ.9,50,218 మేర అక్రమాలు చోటు చేసుకున్నాయి. ►గతంలో భక్తులు సమర్పించే చీరల వ్యవహారాలన్నీ ఆలయ రెగ్యులర్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉండేవి. టీడీపీ సర్కారు హయాంలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే అమ్మవారి చీరల పర్యవేక్షణను ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కనీసం ప్రభుత్వ అనుమతి కూడా లేదు. ఈవో కోటేశ్వరమ్మ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఒక జూనియర్ అసిస్టెంట్ ద్వారానే 14 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపులు చేశారు. ►ఆలయ అధీనంలో ఉండే వేద పాఠశాల, ప్రసాదం స్టోర్, గుడిలో పని చేసే క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు కలిపి 21 మంది సిబ్బందిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. ►గర్భగుడిలో అమ్మవారి అలంకారం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేయాలి. టీడీపీ హయాంలో.. కోటేశ్వరమ్మ ఈవోగా పనిచేసిన కాలంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అమ్మవారి అలంకారం కోసమంటూ కన్సాలిడేట్ పే కింద ఒక వ్యక్తిని నియమించారు. దీనివల్ల గర్భాలయంలోకి బయటి వ్యక్తుల ప్రవేశానికి వీలు కలిగినట్టయ్యిందని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ►ఆలయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆలయానికి వివిధ వ్యక్తులు చెల్లించాల్సిన బిల్లులు రూ.6.65 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు కమిషనర్ తన నివేదికలో వెల్లడించారు. -
ఏమిటీ శిక్ష?
సాక్షి, విజయనగరం: సర్వశిక్ష అభియాన్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా ఎంపికైన యాభై ఎనిమిది మందికి నేటికీ నియామక పత్రాలు అందలేదు. గతంలో ప్రాజెక్టు ఆఫీసర్ చేపట్టిన నియామకాలపై అభ్యంతరాలున్నాయని ప్రస్తుత పీఓ అంటుంటే ... జిల్లా కలెక్టర్ అనుమతిచ్చినా ప్రాజెక్టు ఆఫీసర్ అడ్డుతగులుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. నిజానికి సమాధానం చెప్పాల్సిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ముఖం చాటేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చేసేది లేక అభ్యర్థులంతా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలోని కేజీబీవీ పరిధి వివిధ కేటగిరీలో ఉన్న నాన్ టీచింగ్ 134 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి గతేడాది ఎంపిక ప్రక్రియ చేపట్టి, పూర్తి చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ 58 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేసి జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. గతేడాది డిసెంబర్లో కలెక్టర్ ఆ జాబితా ను అనుమతించారు. ఈ మేరకు 58 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అదే నెలలో విడుదల చేశారు. శాపంగా మారిన పాత పీఓ బదిలీ ఈ నియామక ప్రక్రియ జరిగిన సమయంలో ఎస్ఎస్ఏ పీఓగా ఉన్న బి.శ్రీనివాసరావు రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరా వు, కిమిడి కళావెంకటరావు మధ్య జరిగిన అంతర్యుద్ధ్ధం లో భాగంగా ప్రస్తుత పీఓ ఎం.కృష్ణమూర్తి నాయుడు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన వచ్చేనాటికే సిద్ధమైన 58 మంది జాబితాను విడుదల చేయకుండా రెండు నెలల పాటు తాత్సారం చేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ వెంటనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చాయి. ఫలితంగా నియామక ఆదేశాలున్నప్పటికీ అభ్యర్థులకు పోస్టులు రాలేదు. ఇతర జిల్లాల్లో వీరితోపాటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నా... ఇక్కడే పెండింగ్‌లో ఉండిపోయింది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఎంపికైన అభ్యర్థులు పలుమార్లు కలెక్టర్‌ను కలిశారు. అప్పటి ఆదేశాల మేరకు పోస్టులను పీఓ ఇస్తారని ఆయన చెప్పడంతో అభ్యర్థులు పీఓ కృష్ణమూర్తి నాయుడు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రతికూల సమాధానం వచ్చింది. తమకు న్యా యం చేయాలని వారంతా సర్వశిక్షాభియాన్ చుట్టూ తిరుగున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీతో పాత ఏజెన్సీల కాలపరిమితి ముగుస్తుందని ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వారు కలెక్టరేట్ గురువారం వచ్చి కలెక్టర్‌ని కలిసి వేడుకున్నారు. కొత్తగా ఆదేశాలివ్వక్కర్లేదని అప్పటి ఆదేశాలతో పోస్టులను పీఓ ఇవ్వాలని అభ్యర్థులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ వివరించారు. వారు మళ్లీ పీఓ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి పాతకథే ఎదురైంది. అయితే గత పీఓ చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యం తరాలున్నాయని ప్రస్తుత పీఓ కృష్ణమూర్తి చెబుతున్నారు. అభ్యర్థులు న్యాయం అడగాల్సింది ఔట్సోర్సింగ్ ఏజెన్సీని లేదా పాత అధికారినేగాని తనను కాదని ఈయన చెబుతున్నారు. మొత్తమ్మీద వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ల(ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్దీకరించడానికున్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది. విద్యుత్ సంస్థలలో ఎంతో కాలంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖ అధికారులను గతంలో ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ అంశంపై విచారణ కొనసాగించింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ తరుఫున వాదించే లాయర్లు హైకోర్టుకు వివరించారు. ప్రమాదపుటంచుల్లో ప్రతీ దినం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు. వారిని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. మెరుగైన విద్యుత్ సరఫరాకోసం కష్టపడుతున్న ఆర్టిజన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని వివరించారు.విద్యుత్ శాఖ వాదనలను హైకోర్టు సమర్థించింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను రద్దు చేసింది. ముఖ్యమంత్రి హర్షం, పీఆర్సీ అమలుకు హామీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సేవలను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆర్జిజన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకున్నదని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని సిఎం చెప్పారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇంది పండుగ రోజని ముఖ్యమంత్రి అభివర్ణించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారి జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుతో సిఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ నిర్ణయించాలని, వారికి పి.ఆర్.సి.అమలు చేయాలని సిఎండిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వారు రెగ్యులర్ ఉద్యోగులే : సీఎండీ ప్రభాకర్ రావు హైకోర్టు తీర్పు పట్ల సీఎండీ ప్రభాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, ఇవాళ కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సీఎండీ అన్నారు. విద్యుత్ శాఖకు ఇది ఎంతో శుభ దినమని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి పే స్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ సిఎండి ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని ఆర్జిజన్లు రెగ్యులరైజ్ కావడం వల్ల పొందగలిగారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. -
‘మునిసిపల్’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్ : మునిసిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.8,300 నుంచి రూ.12,000లకు, డ్రైవర్ల వేతనాలు రూ.15 వేలకు, కంప్యూటర్ ఆపరేటర్లు/సీనియర్ అసిస్టెంట్లు/ఇతర కార్యాలయ సిబ్బంది వేతనాలు రూ.17,500కు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీతో పురపాలక శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. పెరిగిన వేతనాలను ఏప్రిల్ నుంచే అమలు చేయనున్నారు. పెంపు ద్వారా 17,022 మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. వీరిలో 11,497 మంది పురుషులు.. 5,525 మంది మహిళలున్నారు. జీవో నంబర్ 14 ప్రకారం.. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ 2016 ఫిబ్రవరి 19న ఆర్థిక శాఖ జీవో నం.14 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కార్మికుల వేతనాలు పెంచుతామని శ్రీదేవి హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. వేతనాల పెంపుతో పాటు బకాయి వేతనాల చెల్లింపు, ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే కార్మికుల క్రమబద్ధీకరణ, అంత్యక్రియల ఖర్చుకు రూ.20 వేలు, చెప్పులు, నూనెలు తదితర డిమాండ్లపై త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్నారని తెలిపారు. వేతనాల పెంపు కోసం ఈ నెల 25 నుంచి సమ్మె బాట పట్టిన కార్మికులు.. పెంపునకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమించి ఆదివారం విధులకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీలో రెండేళ్ల కిందట ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. పురపాలికల తీర్మానాలతో.. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపునకు అనుకూలంగా ఇప్పటికే 56 పురపాలికలు కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేశాయి. పెంపును వ్యతిరేకిస్తూ నర్సంపేట మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. మిగిలిన 16 పురపాలికలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. అన్ని పురపాలికల్లో ఈ నెల 30లోగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పెంపుపై తీర్మానం చేయాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. పెంపునకు వ్యతిరేకంగా తీర్మానించిన నర్సంపేటలో మళ్లీ సమావేశం నిర్వహించి అనుకూలంగా తీర్మానం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త పురపాలికల్లోనూ.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ హోదా గల 136 గ్రామాల విలీనంతో రాష్ట్రంలో 68 కొత్త పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 45 పురపాలికల్లో మరో 173 గ్రామాలు విలీనమవనున్నాయి. వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రాంతాల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కూడా తక్షణమే అమల్లోకి రానుంది. ఇతర పురపాలికలతో సమానంగా కొత్త పురపాలికల్లోనూ వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. -
‘పుర’ కార్మికులకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్ : పురపాలికల కౌన్సిల్ అనుమతితో వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపును అమలు చేసి వారితో సమ్మె విరమింపజేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏ పురపాలిక కౌన్సిల్ అయినా తీర్మానం చేయకుంటే వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. శనివారం సచివాలయంలో మున్సి పల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్లో ఆయన మాట్లాడుతూ.. వేతనాల పెంపునకు మునిసిపాలిటీల నిధులు వినియోగించుకోవాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు కలెక్టర్లకు అందుబాటులో ఉండి పారిశుధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. సమ్మె కొనసాగు తున్న చోట ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మునిసిపల్‌శాఖ మంత్రి ఆదేశించా రని ఆయన చెప్పారు. అనుకూల వార్తలకు చర్యలు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబం ధాల అధికారులు సమన్వయం చేసుకుని మీడియాలో అనుకూల వార్తలు వచ్చేలా చూడాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఖమ్మం కార్పొ రేషన్ 99% వసూలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. -
వాళ్లకు 5,300 పెంచారు.. మాకు 2,500లేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఆ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కేవలం రూ. 2,500 మాత్రమే జీతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 2,500 జీతం పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెంపు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉద్యోగులు.. పీఆర్సీ ప్రకారం తమకు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 5,300 జీతం పెంచారని, అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తమకు రూ. 2,500 మాత్రం జీతం పెంచితే ఎలా బతికేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన దేనికీ సరిపోదని, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్న నేపథ్యంలో ఇంతతక్కువమొత్తంలో జీతాన్ని పెంచడం ఏమాత్రం సమంజసం కాదని వారు అంటున్నారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలలో కొత్తకోణం
-
'6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించాం'
హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో సోమవారం తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 నెలల్లోనే విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. నీటి సరఫరా విషయంలో కూడా తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో రద్దీకి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపడుతామని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఉచిత వైద్య సేవలకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో ఉచిత వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సోమవారం ఆయా నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలన్నీ నిలిచిపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యాన్ని పొందవచ్చని భావించి ఆశతో ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు.. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద ఆరోగ్య మిత్రలు కన్పించకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల్లో కీలకమైన నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి సహా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, యశోద, కిమ్స్, సన్‌షైన్, కేర్, అపోలో ఆస్పత్రుల్లో సేవలు స్తంభించాయి. ట్రస్ట్ ముట్టడికి యత్నం.. ఆరోగ్యశ్రీ పథకంలో ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, సిబ్బందిని ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు గౌరవ వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీ ఆరోగ్య మిత్ర, నెట్వర్క్ ఆస్పత్రి మిత్ర, టీమ్ లీడర్స్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, డేటా ఎంట్రి ఆపరేటర్లంతా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది మూడో రోజైన సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య సేవలకు విఘాతం:ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 350కిపైగా ఆస్పత్రు లు ఉండగా.. వీటిలో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున ఐదు నుంచి ఆరు వేల మంది ఔట్‌పేషెంట్ విభాగాల్లో సేవలు పొందుతుండగా, 300 నుంచి 500 మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ట్రస్టుకు పంపాల్సిన ఆరోగ్య మిత్రలు ఆస్పత్రుల్లో లేకపోవ డంతో ఉచిత సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయంగా నియమించిన వారికి అవగాహన లేకపోవడంతో సాంకేతిక లోపాల వల్ల సర్జరీలకు అనుమతులు లభించడంలేదు. -
త్వరలో ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతన పెంపు!
- 50 శాతం పెంపునకు సుముఖత వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సుముఖత వ్యక్తం చేశారు. నాల్గోతరగతి ఉద్యోగాలను భర్తీ చేయకుండా గతంలో చంద్రబాబు ప్రభుత్వమే నిషేధం విధించింది. అప్పటి నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలోనే ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 65 వేలకు పైగా ఉన్నారు. వీరికిప్పుడు 50 శాతం పెంచినా.. ఒకే పనిచేసే ఔట్సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసం మాత్రం భారీగానే ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని మంత్రుల కమిటీ తేల్చింది. రెగ్యులర్‌గా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో మాత్రం 10 లేదా 15 శాతం వెయిటేజ్ ఇవ్వాలని చెప్పింది. -
‘కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి’
నాంపల్లి (హైదరాబాద్): ఆరోగ్య శ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం సమావేశం ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... ప్రధాన సమస్యలైన కనీస వేతనం అమలు చేయాలని, థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి వైద్య ఆరోగ్య విభాగంలో భాగస్వాములను చేయాలని కోరారు. బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగుల బదిలీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచాలి
శ్రీకాళహస్తి రూరల్: ఏపీటూరిజంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచాలని ఏపీ టూరిజం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తురకా శ్రీనివాసులు అన్నారు. బుధవారం చెర్లోపల్లి సమీపంలో ఉన్న ఏపీటూరిజం హరితా రెస్టారెంట్లో ఆయున మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర శాఖలో పనిచేసి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను ఏపీ టూరిజంలో ఉద్యోగులుగా చేర్చుకోవడం వూనాలన్నారు. ఎంతోమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉండగా వారికి అవకాశం కల్పించాల్సింది పోయి ఇలా విశ్రాంత ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం దారుణవున్నారు. పుత్తూరు సమీపంలో ఉన్న హరితా రెస్టారెంట్‌ను ప్రభుత్వం లీజుకు ఇవ్వడానికి ప్రయుత్నిస్తోందని దానికి స్వస్తి పలకాలని కోరారు. హరితా రెస్టారెంట్లకు సివిల్ సపై్ల ద్వారా సరుకులను అందించాలని తెలిపారు. ఏపీటూరిజంశాఖలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వెంటనే బదిలీ చేసి రాష్ట్రంలోని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని డివూండ్ చేశారు. -
ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెరుపు సమ్మె
వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. ఏడాదిగా తమకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్‌తోపాటు గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్య దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. తమ ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో చందాలు జమ చేయటం లేదని ఆరోపించారు. విధులు బహిష్కరించి, వారు ధర్నాకు దిగటంతో వైద్య సేవలకు పాక్షికంగా అంతరాయం కలిగింది. కాగా, ఆస్పత్రిలో మూడు ఏజెన్సీలకు చెందిన మొత్తం 130 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. -
‘గెటౌట్’ సోర్సింగే..
‘ఏరు దాటే వరకూ ఊరింపు.. దాటాక వెక్కిరింపు’ అన్నట్టుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తా’.. ఇది ఆయన ఎన్నికల్లో చేసిన వాగ్దానం. ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఉద్వాసన’ ఇదీ ఇప్పుడాయన సర్కారు అమలు చేస్తున్న విధానం. అధికారంలోకి రాగానే రైతు, డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానన్న ఆయన వాటిపై పూటకో మాట మారుస్తున్నా.. ‘ఉపాధి మాఫీ’ అమలులో మాత్రం చురుకుగా వ్యవహరిస్తున్నారు. సాక్షి, రాజమండ్రి : వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇళ్లకు సాగనంపేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఒక పక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కమిటీ వేశామంటూనే వారిని తొలగించనుంది. ఈ పొట్టకొట్టే నిర్ణయాన్ని ముందుగా గృహ నిర్మాణ శాఖ నుంచి అమలు చేయనున్నారు. ఆ శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈనెల 31 నుంచి ఇంటికి పంపేందుకు అధికారులు శ్రీముఖాలు సిద్ధం చేశారు. హతాశులైన చిరుద్యోగులు జలయజ్ఞం పథకం భూసేకరణ విభాగంలోని వివిధ యూనిట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుతో ఈ ‘ఉపాధి మాఫీ’ ప్రారంభమైంది. అనంతరం గృహనిర్మాణ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జూన్ 30 నుంచి తొలగించాలని గత నెల రెండో వారంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు ఆందోళన చే యడంతో తొలగింపు గడువును జూలై 31 వరకూ పెంచారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 220 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇప్పుడు తొలగించనున్నారు. ఈ నెలాఖరున ‘నో డ్యూటీ’ సర్టిఫికెట్లు తీసుకుని ఉద్వాసన పలకాలని సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కమిటీ వేసిందన్న వార్తతో తమ కొలువులు మరి కొంత కాలం కొనసాగుతాయని ఆశించిన చిరుద్యోగులు హతాశులయ్యారు. గృహ నిర్మాణశాఖ అనంతరం ఇదే విధానాన్ని మిగిలిన శాఖల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 4500 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. జీతాల సొమ్ముకు కేటాయింపులు కరువు.. గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన రాష్ట్రంలో 1200 మంది వరకూ పని చేస్తున్నారు. వీరికి ఏటా జీతాలు చెల్లిం చేందుకు రూ.39 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులంటున్నారు. ఆర్థికశాఖ నుంచి ఇప్పటి వరకూ కొత్తగా ఎలాంటి కేటాయింపులు లేనందున ఉద్యోగులను కొనసాగించి, జీతాలను చెల్లించడం కష్టతరమంటున్నారు. ప్రభుత్వం వారిని కనికరిస్తే తప్ప ఉద్యోగులను కొనసాగించలేమని తెగేసి చెబుతున్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగాలు హుష్ కాకి
కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు రోడ్డున పడనున్న వందలాది మంది ఉద్యోగులు విజయనగరం ఆరోగ్యం,న్యూస్‌లైన్: వైద్య విధాన్ పరిషత్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోనుంచి తొలగించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలోవైద్యులు, స్టాఫ్ నర్సులు,పారామెడికల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో వార్డు బాయ్‌లు, రేడియోగ్రాఫర్లు, సి.టి. స్కాన్ టెక్నీషియన్లు, థియేటర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.ై వెద్య విధాన్ పరిషత్ అధీనంలో కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి, గజపతినగరం, భోగాపురం, బాడంగి, ఎస్.కోట,పార్వతీపురం ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుమారు 150 నుంచి 170 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరినీ ఈ నెలాఖరుకల్ల్లా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల నుంచి తొలగిస్తే పరిస్థితి ఏంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే ఉద్యోగం సంపాదిద్దామంటే వయో పరిమితి అయి పోయిన తర్వాత తమను ఎవరు తీసుకుంటారంటూ వాపోతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఆస్పత్రుల సేవలసమన్వయాధికారి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోనుంచి తొలగించాలని ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. -
'ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి’
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు పెంపుతో పాటు, 10వ పీఆర్సీ వేతన ఒప్పందాన్ని ప్రారంభ తేదీ నుంచే వర్తింప చేయాలని కోరారు. ఈ మేరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు దిగారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్, సీపీఐ నేత గుండా మల్లేష్, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.