శ్రీకాళహస్తి రూరల్: ఏపీటూరిజంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచాలని ఏపీ టూరిజం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తురకా శ్రీనివాసులు అన్నారు. బుధవారం చెర్లోపల్లి సమీపంలో ఉన్న ఏపీటూరిజం హరితా రెస్టారెంట్‌లో ఆయున మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర శాఖలో పనిచేసి రిటైర్‌మెంట్ అయిన ఉద్యోగులను ఏపీ టూరిజంలో ఉద్యోగులుగా చేర్చుకోవడం వూనాలన్నారు.
ఎంతోమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉండగా వారికి అవకాశం కల్పించాల్సింది పోయి ఇలా విశ్రాంత ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం దారుణవున్నారు. పుత్తూరు సమీపంలో ఉన్న హరితా రెస్టారెంట్‌ను ప్రభుత్వం లీజుకు ఇవ్వడానికి ప్రయుత్నిస్తోందని దానికి స్వస్తి పలకాలని కోరారు. హరితా రెస్టారెంట్లకు సివిల్ సపై్ల ద్వారా సరుకులను అందించాలని తెలిపారు. ఏపీటూరిజంశాఖలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వెంటనే బదిలీ చేసి రాష్ట్రంలోని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని డివూండ్ చేశారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచాలి
Published Thu, Feb 26 2015 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement