సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రిలోని నాలుగో తరగతి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వాపోయారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి తమ మొర వినిపించారు. గాంధీ ఆసుపత్రిలో సేవలందించేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని, తాము ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు.
కష్టకాలంలో అందించిన సేవలను మరిచి ఇప్పుడు తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరున ఉద్యోగాలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు.
చదవండి: వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం
Comments
Please login to add a commentAdd a comment