పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : పురపాలికల కౌన్సిల్ అనుమతితో వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపును అమలు చేసి వారితో సమ్మె విరమింపజేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏ పురపాలిక కౌన్సిల్ అయినా తీర్మానం చేయకుంటే వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. శనివారం సచివాలయంలో మున్సి పల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వేతనాల పెంపునకు మునిసిపాలిటీల నిధులు వినియోగించుకోవాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు కలెక్టర్లకు అందుబాటులో ఉండి పారిశుధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. సమ్మె కొనసాగు తున్న చోట ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మునిసిపల్‌శాఖ మంత్రి ఆదేశించా రని ఆయన చెప్పారు.
అనుకూల వార్తలకు చర్యలు
మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబం ధాల అధికారులు సమన్వయం చేసుకుని మీడియాలో అనుకూల వార్తలు వచ్చేలా చూడాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఖమ్మం కార్పొ రేషన్ 99% వసూలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment