aravind kumar
-
IAS అధికారి అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో
-
ఫార్ములా-ఈ రేసింగ్: ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు సంబంధించిన వ్యహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 54 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్‌పై ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్-4) రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా-ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు -
ఉద్యోగులందరూ విధుల్లో ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో గురువారం మాట్లాడారు. ఉత్తర తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. నిర్మల్ వంటి చోట్ల భారీగా వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలపై స్థానిక జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే విపత్తు స్పందన దళం (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-డీఆర్ఎఫ్) అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ప్రతి ఒక్క పురపాలక శాఖ అధికారి/ ఉద్యోగి విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు. -
కాళ్లు మొక్కుతా.. మద్దతు ఇవ్వండి
‘మీ కాళ్లు మొక్కుతా సారు. పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించుండ్రి. పసుపు పండించి ఏటా నష్టపోతున్నాం. చేసిన కష్టానికి ఫలితం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా అత్తలేదు. పసుపు పండించమంటేనే భయమైతుంది. రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మా పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోండి సారు.. రూ.15 వేలు కాకపోయినా కనీసం రూ.10 వేల మద్దతు ధర వచ్చేలా చూడుండ్రి’ రైతులతో ఎంపీ ముఖాముఖి కార్యక్రమంలో మోతెకు చెందిన రైతు సంజీవ్ ఆవేదన ఇది. సమావేశంలో ఆయన అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, తన గోడు వెల్లబోసుకున్నాడు. రైతుల దయనీయ స్థితిని వివరిస్తూ పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించాలని వేడుకున్నాడు. మోర్తాడ్(బాల్కొండ): చర్చలు ఫలించలేదు.. రైతుల ఆశలు తీరలేదు.. పసుపుబోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర ప్రధాన ఎజెండాగా సాగిన రైతు అభ్యర్థులతో ఎంపీ అర్వింద్ ముఖాముఖి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎటూ తేల్చకుండానే ఈ కార్యక్రమం అసంపూర్తిగా ముగిసింది. అయితే, రైతుల ఆవేదన వెల్లబోసుకునేందుకు ‘ముఖాముఖి’ వేదికైంది. పంట సాగుకు పెడుతున్న పెట్టుబడులు, తాము పడుతున్న కష్టాలు, తమకు వస్తున్న నష్టాలను కళ్ల కు కట్టినట్లు కర్షకులు వివరించారు. కాళ్లు మొక్కుతామని, తమ కష్టాలు తీర్చాలని ప్రాధేయపడ్డా రు. అయితే, పసుపు పంటకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉండదన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదనలు పంపిస్తే న్యాయం చేస్తామని తెలిపారు. అయితే, గతంలో ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో పసుపుబోర్డు తేవాలని, లేకుంటే పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశా రు. ఈ క్రమంలో వాడివేడీగా వాదనలు సాగాయి. ఎటూ తేల్చకుండానే చర్చలు ముగిశాయి. ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ అర్వింద్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వాగ్వాదం తరలి వచ్చిన రైతు అభ్యర్థులు.. పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు మద్దతు ధర కోసం ఏళ్లుగా పోరాడుతున్న రైతులు.. 2019 లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. నిజామాబాద్ స్థానం నుంచి 178 మంది రైతులు పోటీలో నిలిచి దేశ వ్యాప్త చర్చకు అవకాశమిచ్చా రు. అయితే, ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కా వొస్తున్నా పసుపుబోర్డు ఏర్పాటు కాకపోవడం, మ ద్దతు ధర లభించక పోవడంతో రైతులు మరోమా రు ఉద్యమాన్ని లేవదీశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రైతు అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లిలోని ఓ ఫంక్షన్లో హాల్లో శనివారం సమావేశమయ్యారు. మన జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులు తరలి వచ్చారు. బోర్డు, మద్దతు ధర కావాలి.. రాజకీయ పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ ముఖాముఖిలో ఎంపీ అభ్యర్థులు.. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని, రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అర్వింద్ పసుపుబోర్డు ఏర్పాటుపై బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయాన్ని రైతులు పదే పదే గుర్తు చేశారు. హామీకి కట్టుబడి ఉన్నానన్న ఎంపీ.. అయితే, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ఎంపీ అర్వింద్ తెలిపారు. తాను ఎన్నికైన వెంటనే పసుపుబోర్డుకు మించి సేవలందించే స్పైసిస్‌బోర్డు, ఇతర పథకాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని వివరించారు. 2019 మే చివరి వారంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టగా, జూన్ నెలలోనే తన పని తాను మొదలు పెట్టానని తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్, హోం మంత్రి అమిత్‌షాలను సంప్రదించి స్పైసిస్‌బోర్డు రీజినల్ కార్యాలయాన్ని సాధించామని వివరించారు. పసుపు ధర పెరగాలంటే దళారీ వ్యవస్థ ఉండకూడదని, ఇందుకోసం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామని చెప్పారు. ప్రాంతీయ పంటలకు మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తే అవసరమైన కార్యాచరణ అమలు చేయడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంగీకరించని రైతులు.. అయితే, ఎంపీ చెప్పిన అంశాలను రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటన రెండే అంశాలను ఎజెండాగా తాము చర్చలకు వచ్చామని, వీటిపై స్పష్టత ఇవ్వకుండా ఇతర అంశాలను చర్చించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీకి, రైతు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పలు సందర్భాల్లో రైతులు జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్ సమావేశం నుంచి వెళ్లి పోయారు. చర్చలు విఫలమయ్యాయని, పసుపుబోర్డు, మద్దతు ధరపై స్పష్టత రాలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. -
ఆ రెండు పట్టణాలు నాకు రెండు కళ్లు: ఈటల
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. రెండు పట్టణాలను పక్కా ప్రణాళికతో సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ హాజరైన ఈ సమావేశంలో హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిస్థాయిలో పరిష్కరించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు పట్టణాలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన సమగ్ర పట్టణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఈటల వారికి సూచించారు. వచ్చే ఆరునెలల్లో ఈ రెండు పట్టణాల రూపురేఖలు మారుస్తానన్న మంత్రి అందుకు అవసరమైన చర్యలను వేగంగా పూర్తి చేయాలని కోరారు. పట్టణాల్లో అన్ని సౌకర్యాలు పట్టణాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నింటికీ సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంటింటికి తాగునీరు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పట్టణాల్లో పారుశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్కులు, రోడ్లపక్కన ఫుట్‌పాత్‌లు, పట్టణ ప్రజలకు అవసరమైన మార్కెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని హంగులతో కూడిన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు, చెరువుల సుందరీకరణ, టాంక్‌బండ్‌ల నిర్మాణం, పందుల పునరావాసం, రింగ్ రోడ్డు నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంతో చరిత్ర గలిగిన హుజూరాబాద్, జమ్మికుంట 2021లో మోడల్ టౌన్లుగా రూపుదిద్దుకోవడం చూడాలన్నారు. మంత్రి ఈటల సూచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారులు అరవింద్‌కుమార్, సత్యనారాయణ తమ అంగీకారం తెలిపారు. ఈ మేరకు మంత్రి సూచనల మేరకు అన్ని విభాగాల అధికారులతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే వారంలో రెండు పట్టణాలు పర్యటించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ స్వప్న, కమిషనర్ రషీద్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, వైస్ చైర్పర్సన్ నిర్మల, కమిషనర్ జోనా పాల్గొని పట్టణాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. అంతేగాక హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు రెండు కళ్ల లాంటివని ఈటల అన్నారు. రెండు పట్టణాల్లో విశాలమైన రోడ్లు వేశామని చెప్పారు. 2014లోనే తాగునీటి కోసం రూ.40 కోట్లు మంజూరు చేసుకున్నాం. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.40 కోట్ల అదనపు నిధులు మంజూరు చేశానన్నారు. వాటిని పురపాలక శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలని, ఇంకెన్ని నిధులైనా మంజూరు చేయించే బాధ్యత తనదని పేర్కొన్నారు. నిధులు కొరత లేదని, అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టణాల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ నీరు నిలవకుండా చూడాలని, కాలువలు, రోడ్లు దోమలకు నిలయాలుగా మారొద్దని చెప్పారు. రోడ్లు, డ్రెయిన్లు, టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలే తప్ప తాత్కాలికంగా పనులు చేయవద్దని, త్వరలోనే పట్టణాల అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఈటల అధికారులకు సూచించారు. -
బలగాల రక్షణలో ప్రశాంతంగా...
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అయోధ్య విషయంలో గతంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా, సీసీ ఫుటేజీల ద్వారా ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌లతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు వద్ద.. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే వాహనాలను, వ్యక్తులను బారికేడ్లతో అడ్డుకొని, క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాకే లోపలికి పంపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా బలగాలను మోహరించారు. రామ జన్మభూమి అయోధ్యలో... అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించింది. రాష్ట్రంలో మొత్తం 112 ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లాలను జోన్ల లెక్కన విభజించి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పరిశీలించారు. 31 జిల్లాల్లోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయోధ్య భూమి ప్రాంతంలో సంచరించే వారిని తనిఖీ చేశారు. దేశ రాజధానిలో.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పలు నిబంధనలను విధించనున్నట్లు పోలీసులు శనివారం ఉదయమే ప్రకటించారు. కోర్టు తీర్పును స్వాగతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేసినందుకుగానూ నోయిడాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత ఢిల్లీ, జామా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్థిక రాజధాని ముంబైలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు 40 వేల మంది పోలీసులు గస్తీ కాశారు. శనివారం ఉదయం 11 నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలను మూసేశారు. -
‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 401తో తీవ్ర ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్‌లో సూచీ 39తో మంచి నాణ్యతను కలిగి ఉంది. ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్‌లో ఉండడానికే నేను ఇష్టపడడానికి మరో కారణమిదే’ అని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ‘అయితే, కేంద్రం నుంచి వచ్చిన డిప్యుటేషన్ ఆఫర్‌ను మీరు తిరస్కరించినట్లు నేను భావించవచ్చా?’అని రీట్వీట్ చేస్తూ ఆదివారం సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీ నుంచి మరో గంటలో నేను ఇంటికి (హైదరాబాద్) వచ్చేందుకు విమానం ఎక్కబోతున్నాను. తిరిగి వచ్చాక నా ఆనందానికి ఇదే కారణం (ఢిల్లీలోని కాలుష్యం) కాబోతోంది’అని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రిటిష్ రాయబారి ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా మరో రీట్వీట్ చేశారు. కాలుష్యం విషయాన్ని పక్కనబెడితే రోడ్ల విషయంలో హైదరాబాద్ అధ్వానంగా తయారైందని, ఢిల్లీ స్థాయిలో నగరంలోని రోడ్లను అభివృద్ధిపరచాలని పలువురు నెటిజన్లు రాష్ట్ర అధికారులకు సూచించారు. Yet another reason why I love being in #Hyderabad vis-a-vis #Delhi (Am being mean 😷) pic.twitter.com/lCwdR4kL01 — Arvind Kumar (@arvindkumar_ias) November 1, 2019 -
‘పుర’ కార్మికులకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్ : పురపాలికల కౌన్సిల్ అనుమతితో వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపును అమలు చేసి వారితో సమ్మె విరమింపజేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏ పురపాలిక కౌన్సిల్ అయినా తీర్మానం చేయకుంటే వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. శనివారం సచివాలయంలో మున్సి పల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్లో ఆయన మాట్లాడుతూ.. వేతనాల పెంపునకు మునిసిపాలిటీల నిధులు వినియోగించుకోవాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు కలెక్టర్లకు అందుబాటులో ఉండి పారిశుధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. సమ్మె కొనసాగు తున్న చోట ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మునిసిపల్‌శాఖ మంత్రి ఆదేశించా రని ఆయన చెప్పారు. అనుకూల వార్తలకు చర్యలు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబం ధాల అధికారులు సమన్వయం చేసుకుని మీడియాలో అనుకూల వార్తలు వచ్చేలా చూడాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఖమ్మం కార్పొ రేషన్ 99% వసూలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. -
మళ్లీ నీ ముఖం నాకు చూపించకు..
- ఓ పరిశ్రమ ప్రతినిధిపై పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటికే ఆరుసార్లు పొడిగింపులు ఇచ్చాం. అయినా మీ తీరు మారలేదు. పదేపదే ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇలాగైతే ఊరుకునేది లేదు. నీ ఫైల్‌ను కొట్టిపారేస్తా. మళ్లీ నీ ముఖం నాకు చుపించకు.. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఓ పరిశ్రమ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ఇంధనశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్న అరవింద్ కుమార్, ఇంధనశాఖ కార్యాలయం నుంచే రెండు శాఖల విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తన చాంబర్ నుంచి బయటకు వచ్చిన అరవింద్ కుమార్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద జరిగే సమావేశానికి వెళ్తుండగా పేషీలో వేచిచూస్తున్న ఓ కంపెనీ ప్రతినిధి ఆయనకు ఎదురుపడి పరిచయం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ కంపెనీ పేరు విన్న వెంటనే అరవింద్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోతూ కంపెనీ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ఆ వ్యక్తి ఓ ఫెర్రో అలాయిస్ కంపెనీ ప్రతినిధి అని తెలిసింది. -
స్థానికత ఆధారంగానే తుది విభజన
సాక్షి, హైదరాబాద్ : స్థానికత (పుట్టిన ప్రాంతం) ఆధారంగానే విద్యుత్ సంస్థల ఉద్యోగుల తుది కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్/ నియామక ఉత్తర్వులు/పోలీసుల ధ్రువీకరణ పత్రం(యాంటిసిడెంట్)ను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల తుది కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు లేఖ రాశారు. అలాగే కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం స్థానికత ఆధారంగానే తుది కేటాయింపులు జరపాలని, ఆ మేరకు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించాలన్నారు. కాగా, స్థానికత ఆధారంగానే విద్యుత్ కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తుది కేటాయింపులు జరపాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ స్థానికత కలిగి ఏపీ ప్రభుత్వంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల న్యాయం జరిగిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుపై ప్రభుత్వ మార్గదర్శకాలివీ... ఒకవేళ ఉద్యోగులు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు చెందని వారైతే, అతను/ఆమె విజ్ఞప్తి ఆధారంగా కేటాయింపులు జరపాలి రాష్ట్ర విభజన రోజు తర్వాత రిటైరైన/మృతిచెందిన ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్ల కేటాయింపులు సైతం స్థానికత ఆధారంగానే జరగాలి తెలంగాణ, ఏపీల బయట ఉన్న మాచ్‌కుండ్, టీబీ డ్యాం, మినీ హైడల్ తదితర అన్ని ప్రాజెక్టుల్లో 53.89 శాతం పోస్టులను తెలంగాణకు కేటాయించాలి. తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను అక్కడ నియమించేందుకు తెలంగాణ జెన్కో చర్యలు తీసుకోవాలి నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ డ్యాం విద్యుదుత్పత్తి కేంద్రంలోని అన్ని పోస్టులు తెలంగాణకే కేటాయింపు. తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను అక్కడ పోస్ట్ చేసేందుకు టీ జెన్కో చర్యలు తీసుకోవాలి ఏపీలో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలి. మిగిలిన ఉద్యోగుల్లో ఈ ఏడు మండలాల స్థానికతగల ఉద్యోగుల వారు తెలంగాణకు రావాలని కోరుకుంటే కేటాయింపు జరపాలి ఇద్దరూ ఉద్యోగులు అయితే.. ఇద్దరు ఒకే రాష్ట్ర స్థానికతను కలిగి ఉంటే ఇద్దరినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలి ఒకరు రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తుంటే మరోకరు పీఎస్‌యూ/రక్షణ సంస్థలు/రైల్వే/బ్యాంకింగ్/బీమా/ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం లో పని చేస్తుంటే అలాంటి కేసులను పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ ఉద్యోగాలు జాతీయ స్థాయిలో స్థానచలనం కలిగి ఉంటాయి భాగస్వామి వేరే రాష్ట్ర వాసి అయితే విజ్ఞప్తిపై ఇద్దరిని ఒకే రాష్ట్రానికి కేటాయించాలి ఐఏఎస్ అధికారుల జీవిత భాగస్వాములను వారున్న రాష్ట్రానికే కేటాయించాలి. వ్యక్తిగత సమస్యలున్న ఉద్యోగుల మార్గదర్శకాలు వితంతు/చట్టపరంగా విడాకులు పొందిన మహిళా ఉద్యోగులను వారి విజ్ఞప్తిపై కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి 60%కిపైగా వైకల్యంగల ఉద్యోగులను వారి ఆప్షన్ ఆధారంగా కేటాయించాలి ఉద్యోగి, జీవిత భాగస్వామి, సంతానంలో ఎవరైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ/బైపాస్ సర్జరీ, కిడ్నీ మార్పిడి/కిడ్నీ వైఫల్యం లాంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతుంటే ఆ ఉద్యోగినీ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. హైదరాబాద్ బయటి ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకే ఈ అవకాశం కల్పించాలి.