మళ్లీ నీ ముఖం నాకు చూపించకు.. | industies secretary shows anger on one pf the enterprenuer | Sakshi
Sakshi News home page

మళ్లీ నీ ముఖం నాకు చూపించకు..

Published Wed, Jul 22 2015 4:57 AM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

మళ్లీ నీ ముఖం నాకు చూపించకు.. - Sakshi

మళ్లీ నీ ముఖం నాకు చూపించకు..

- ఓ పరిశ్రమ ప్రతినిధిపై పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్:
‘ఇప్పటికే ఆరుసార్లు పొడిగింపులు ఇచ్చాం. అయినా మీ తీరు మారలేదు. పదేపదే ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇలాగైతే ఊరుకునేది లేదు. నీ ఫైల్‌ను కొట్టిపారేస్తా. మళ్లీ నీ ముఖం నాకు చుపించకు.. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఓ పరిశ్రమ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు.

ఇంధనశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్న అరవింద్ కుమార్, ఇంధనశాఖ కార్యాలయం నుంచే రెండు శాఖల విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తన చాంబర్ నుంచి బయటకు వచ్చిన అరవింద్ కుమార్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద జరిగే సమావేశానికి వెళ్తుండగా పేషీలో వేచిచూస్తున్న ఓ కంపెనీ ప్రతినిధి ఆయనకు ఎదురుపడి పరిచయం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ కంపెనీ పేరు విన్న వెంటనే అరవింద్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోతూ కంపెనీ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ఆ వ్యక్తి ఓ ఫెర్రో అలాయిస్ కంపెనీ ప్రతినిధి అని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement