'6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించాం'
హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో సోమవారం తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 నెలల్లోనే విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
నీటి సరఫరా విషయంలో కూడా తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో రద్దీకి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపడుతామని కేటీఆర్ పేర్కొన్నారు.