
సెప్టెంబర్‌లో వృద్ధి 2 శాతమే
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం.
క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది.