Group of Eight
-
మౌలిక రంగం.. మందగమనం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది. -
మౌలికం 6.3 శాతం అప్
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి మే నెలలో 6.3 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. గతేడాది ఇదే నెలలో ఇన్ఫ్రా రంగ వృద్ధి 5.2 శాతం. మరోవైపు, ఏప్రిల్‌లో నమోదైన 6.7 శాతంతో పోలిస్తే గత నెలలో వృద్ధి మందగించడం గమనార్హం. ఎరువులు, క్రూడాయిల్, సిమెంటు రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది కీలక మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో.. బొగ్గు ఉత్పత్తి 10.2 శాతం, సహజ వాయువు 7.5 శాతం, విద్యుదుత్పత్తి 12.8 శాతంగా నమోదైంది. 2023లో ఇదే నెలలో ఇవి వరుసగా 7.2 శాతం, (–) 0.3 శాతం, 0.8 శాతంగా ఉన్నాయి. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ వృద్ధి రేటు 0.5 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 7.6 శాతానికి మందగించింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, దశలవారీగా సుదీర్ఘ సమయం పాటు పార్లమెంటు ఎన్నికలు జరగడం వంటి అంశాలు కొన్ని రంగాల్లో కార్యకలాపాలపై ప్రభావం చూపి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌కి భారీ డిమాండ్ నెలకొందని, ఏప్రిల్‌తో పోలిస్తే మే లో బొగ్గు, విద్యుత్ రంగాల వృద్ధికి ఇది దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. మే నెలలో ఐఐపీ వృద్ధి 4–5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నాయర్ చెప్పారు. -
India eight core industries: మౌలిక పరిశ్రమల గ్రూప్ నిరాశ
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ డిసెంబర్లో తీవ్ర నిరాశను మిగిలి్చంది. అధికారిక గణాంకాల ప్రకారం వృద్ధి రేటు 3.8%గా నమోదయ్యింది. అంతక్రితం గడచిన 14 నెలల్లో గ్రూప్ ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు నమోదుచేసుకోవడం ఇదే తొలిసారి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40% వెయిటేజ్ ఉన్న గ్రూప్‌లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. వీటిలో ఒక్క సహజ వాయువు రంగం (6.6%) పురోగమించింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1% క్షీణించింది. ఇక ఆరు రంగాల వృద్ధి రేట్లూ 2022 డిసెంబర్‌తో పోల్చితే 2023 డిసెంబర్లో తగ్గాయి. కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య ఈ రంగాల వృద్ధి రేటు దాదాపు స్థిరంగా 8.1% వద్ద నిలిచింది. -
నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
ఎనిమిది పరిశ్రమల గ్రూప్.. అక్కడక్కడే!
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. -
జనవరిలో మౌలిక రంగం ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ జనవరిలో మంచి ఫలితా న్ని నమోదు చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు సమీక్షా నెల్లో 7.8 శాతంగా నమోదయ్యింది. 4 నెలల గరిష్ట స్థాయి ఇది. క్రూడ్ ఆయిల్ (1.1 శాతం క్షీణత) మినహా మిగిలిన ఏడు రంగాలూ వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. వీటిలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్–జనవరి మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 49.27 శాతం. -
మౌలిక రంగం పరుగు
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో మంచి పురోగతిని కనబరిచింది. ఈ రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, ఎరువుల విభాగాలుమినహా కీలక రంగాల పురోగతితోపాటు లో బేస్ ఎఫెక్ట్ కూడా దీనికి కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లో బేస్‌తో పోలి్చతే తాజా సమీక్షా నెల్లో ఎనిమిది రంగాల ఉత్పత్తి 11.6 శాతం పెరిగిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ దాదాపు 40.27 శాతం. గురువారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన గణాంకాలను పరిశీలిస్తే... ► బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. ► సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. ► పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1% పెరిగింది. ► విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. ► క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3 శాతం క్షీనత నమోదయ్యింది. -
‘బేస్’ మాయలో ఏప్రిల్ మౌలిక రంగం
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌పై ఏప్రిల్‌లో పూర్తి ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. ఏకంగా 56.1 శాతం పురోగతి నమోదయ్యింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పు ను ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 ఏప్రిల్‌ను తీసుకుంటే, ఎనిమిది రంగాల గ్రూప్‌లో కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా 37.9% క్షీణత నమోదయ్యింది. సమీక్షా కాలంలో కీలక రంగాలను వేర్వేరుగా సమీక్షిస్తే... ► సహజ వాయువు: 19.9 శాతం క్షీణత నుంచి 25 శాతం పురోగతికి మారింది. ► రిఫైనరీ ప్రొడక్టులు: 24.2 శాతం క్షీణ రేటు నుంచి 30.9 శాతం వృద్ధికి చేరింది. ► స్టీల్: 82.8 శాతం మైనస్ నుంచి 400 శాతం వృద్ధికి హైజంప్ చేసింది. ► సిమెంట్: 85.2 శాతం క్షీణ రేటు నుంచి 548.8 శాతం పురోగమించింది ► విద్యుత్: 22.9 శాతం నష్టం నుంచి 38.7 శాతం వృద్ధితో యూటర్న్ తీసుకుంది. ► బొగ్గు: 9.5 శాతం పురోగమించింది. ► ఎరువులు: స్వల్పంగా 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► క్రూడ్ ఆయిల్: క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఏప్రిల్‌లోనూ దిగజారింది. 2.1% క్షీణతనే నమోదుచేసుకుంది. అయితే 2020 ఏప్రిల్ నాటి మైనస్ 6.4% క్షీణత రేటు కొంత తగ్గడం కొంత ఊరట. ఐఐపీ 150% పెరిగే చాన్స్! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉంది. భారీ బేస్ ఎఫెక్ట్ వల్ల ఐఐపీ పెరుగుదలసైతం 130 నుంచి 150 శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి..
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఎనిమిది దేశాల కూటమిని జీ-8 (గ్రూప్ ఆఫ్ ఎయిట్) దేశాలని పిలుస్తారు. ఈ కూటమి 1975లో ఆరు దేశాలతో ఆవిర్భవించింది. అవి ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, యునెటైడ్ కింగ్డమ్, యునెటైడ్ స్టేట్స్. ఈ జీ6 దేశాల మొదటి సదస్సు ఫ్రాన్స్‌లో జరిగింది. ఇది 1976లో కెనడా చేరికతో జీ7గా మారింది. ఈ గ్రూపులో 1998లో రష్యా ఎనిమిదో సభ్య దేశంగా చేరింది. కూటమిలో ఐరోపా యూనియన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రిమియాను తనలో అంతర్భాగం చేసుకున్నందుకుగాను 2014, మార్చి 24న రష్యాను కూటమి నుంచి సస్పెండ్ చేశారు. అందువల్ల ప్రస్తుతానికి ఇది జీ7 కూటమిగా ఉంది. కూటమి 40వ సదస్సు: కూటమి 40వ సదస్సు రష్యాలోని సోచి నగరంలో జరగాలి. కానీ, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాను సస్పెండ్ చేయడంతో సదస్సు వేదికను బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు మార్చారు. ఇందులో రష్యా పాల్గొనలేదు కాబట్టి దీన్ని జీ7 సదస్సుగా పరిగణిస్తున్నారు. ఐరోపా యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. ఐరోపా యూనియన్ జీ8/జీ7 సదస్సుకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. సదస్సులో పాల్గొన్న నేతలు: స్టీఫెన్ హార్పర్- కెనడా ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ హాలండ్- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏంజెలా మెర్కల్- జర్మనీ చాన్స్‌లర్ మాటియో రెంజీ- ఇటలీ ప్రధాని షింజో అబే- జపాన్ ప్రధాని డేవిడ్ కామెరాన్- బ్రిటిష్ ప్రధాని బరాక్ ఒబామా- అమెరికా అధ్యక్షుడు జోస్ మాన్యుల్ బరోసో- ఐరోపా కమిషన్ అధ్యక్షుడు హెర్మాన్ వాన్ రోంపీ- ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఈ సదస్సులో జీ-7 దేశాల నేతలు.. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని అతిక్రమిస్తున్నందుకు రష్యాను తీవ్రంగా విమర్శించారు. కూటమి 41వ సదస్సు 2015 జూన్‌లో జర్మనీలో జరుగుతుంది.