![India core sector output increases by 7. 8percent in January - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/1/CORE-INFRA.jpg.webp?itok=1-sIyPaz)
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ జనవరిలో మంచి ఫలితా న్ని నమోదు చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు సమీక్షా నెల్లో 7.8 శాతంగా నమోదయ్యింది. 4 నెలల గరిష్ట స్థాయి ఇది. క్రూడ్ ఆయిల్ (1.1 శాతం క్షీణత) మినహా మిగిలిన ఏడు రంగాలూ వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి.
వీటిలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్–జనవరి మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 49.27 శాతం.
Comments
Please login to add a commentAdd a comment