Industrial sectors Group
-
జనవరిలో మౌలిక రంగం ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ జనవరిలో మంచి ఫలితా న్ని నమోదు చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు సమీక్షా నెల్లో 7.8 శాతంగా నమోదయ్యింది. 4 నెలల గరిష్ట స్థాయి ఇది. క్రూడ్ ఆయిల్ (1.1 శాతం క్షీణత) మినహా మిగిలిన ఏడు రంగాలూ వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. వీటిలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్–జనవరి మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 49.27 శాతం. -
‘బేస్’ మాయలో ఏప్రిల్ మౌలిక రంగం
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్పై ఏప్రిల్లో పూర్తి ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. ఏకంగా 56.1 శాతం పురోగతి నమోదయ్యింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పు ను ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 ఏప్రిల్ను తీసుకుంటే, ఎనిమిది రంగాల గ్రూప్లో కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా 37.9% క్షీణత నమోదయ్యింది. సమీక్షా కాలంలో కీలక రంగాలను వేర్వేరుగా సమీక్షిస్తే... ► సహజ వాయువు: 19.9 శాతం క్షీణత నుంచి 25 శాతం పురోగతికి మారింది. ► రిఫైనరీ ప్రొడక్టులు: 24.2 శాతం క్షీణ రేటు నుంచి 30.9 శాతం వృద్ధికి చేరింది. ► స్టీల్: 82.8 శాతం మైనస్ నుంచి 400 శాతం వృద్ధికి హైజంప్ చేసింది. ► సిమెంట్: 85.2 శాతం క్షీణ రేటు నుంచి 548.8 శాతం పురోగమించింది ► విద్యుత్: 22.9 శాతం నష్టం నుంచి 38.7 శాతం వృద్ధితో యూటర్న్ తీసుకుంది. ► బొగ్గు: 9.5 శాతం పురోగమించింది. ► ఎరువులు: స్వల్పంగా 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► క్రూడ్ ఆయిల్: క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఏప్రిల్లోనూ దిగజారింది. 2.1% క్షీణతనే నమోదుచేసుకుంది. అయితే 2020 ఏప్రిల్ నాటి మైనస్ 6.4% క్షీణత రేటు కొంత తగ్గడం కొంత ఊరట. ఐఐపీ 150% పెరిగే చాన్స్! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉంది. భారీ బేస్ ఎఫెక్ట్ వల్ల ఐఐపీ పెరుగుదలసైతం 130 నుంచి 150 శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
కీలక పరిశ్రమల వృద్ధిరేటు 3.2%
నాలుగు నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణమయ్యాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి (మేలో 4.4 శాతం) మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాలనూ వార్షికంగా వేర్వేరుగా చూస్తే... వృద్ధిలో... ఎరువులు: ఈ రంగం వృద్ధి రేటు భారీగా 18.1 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా, 11.6 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 10.8 శాతానికి ఎగసింది. రిఫైనరీ ప్రొడక్టులు: ఎరువుల రంగం తరహాలోనే ఈ విభాగం - 2.6 శాతం క్షీణత నుంచి స్వల్పంగా 0.5 శాతం వృద్ధిలోకి మళ్లింది. సహజ వాయువు: ఈ రంగం కూడా -5.8 శాతం క్షీణత నుంచి 0.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది. బొగ్గు: వృద్ధి నమోదుచేసుకుంది. అయితే ఈ రేటు 7.6 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. క్షీణతలో.. క్రూడ్: -1.1% నుంచి -0.1%కి మెరుగుపడింది. స్టీల్: 6.6% వృద్ధి నుంచి -2.5% క్షీణతకు మళ్లింది. సిమెంట్: 3.7% వృద్ధి నుంచి -1.5% క్షీణించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ.. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.3 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 5.1 శాతం.