India eight core industries: మౌలిక పరిశ్రమల గ్రూప్‌ నిరాశ | India core sector growth slumps to 14-month low of 3. 8percent in December | Sakshi
Sakshi News home page

India eight core industries: మౌలిక పరిశ్రమల గ్రూప్‌ నిరాశ

Published Thu, Feb 1 2024 5:36 AM | Last Updated on Thu, Feb 1 2024 5:36 AM

India core sector growth slumps to 14-month low of 3. 8percent in December - Sakshi

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ డిసెంబర్‌లో తీవ్ర నిరాశను మిగిలి్చంది. అధికారిక గణాంకాల ప్రకారం వృద్ధి రేటు 3.8%గా నమోదయ్యింది. అంతక్రితం గడచిన 14 నెలల్లో గ్రూప్‌ ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు నమోదుచేసుకోవడం ఇదే తొలిసారి.

మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40% వెయిటేజ్‌ ఉన్న  గ్రూప్‌లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌ రంగాలు ఉన్నాయి. వీటిలో ఒక్క సహజ వాయువు రంగం (6.6%) పురోగమించింది. క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి 1% క్షీణించింది. ఇక ఆరు రంగాల వృద్ధి రేట్లూ 2022 డిసెంబర్‌తో పోల్చితే 2023 డిసెంబర్‌లో తగ్గాయి.  కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య ఈ రంగాల వృద్ధి రేటు దాదాపు స్థిరంగా 8.1% వద్ద నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement