infrastructure industries
-
India eight core industries: మౌలిక పరిశ్రమల గ్రూప్ నిరాశ
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ డిసెంబర్లో తీవ్ర నిరాశను మిగిలి్చంది. అధికారిక గణాంకాల ప్రకారం వృద్ధి రేటు 3.8%గా నమోదయ్యింది. అంతక్రితం గడచిన 14 నెలల్లో గ్రూప్ ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు నమోదుచేసుకోవడం ఇదే తొలిసారి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40% వెయిటేజ్ ఉన్న గ్రూప్‌లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. వీటిలో ఒక్క సహజ వాయువు రంగం (6.6%) పురోగమించింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1% క్షీణించింది. ఇక ఆరు రంగాల వృద్ధి రేట్లూ 2022 డిసెంబర్‌తో పోల్చితే 2023 డిసెంబర్లో తగ్గాయి. కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య ఈ రంగాల వృద్ధి రేటు దాదాపు స్థిరంగా 8.1% వద్ద నిలిచింది. -
జూన్‌లో మౌలిక పరిశ్రమ ఓకే!
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమల గ్రూప్ జూన్‌లో 8.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెల్లో అతి తక్కువ క్షీణ (లో బేస్ ఎఫెక్ట్) గణాంకాలు నమోదుకావడం తాజా ఫలితంపై సానుకూల ప్రభావం చూపింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా 12.4 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది మే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 16.3 శాతంకాగా, ఏప్రిల్‌లో ఏకంగా 60.9 శాతంగా ఉంది. ఎనిమిది పరిశ్రమలు వేర్వేరుగా చూస్తే.. ఆరు రంగాలు వృద్ధి బాటలోకి... ► బొగ్గు : 7.4 శాతం పురోగతి చోటుచేసుకుంది. 2020 ఇదే నెల్లో 15.5 శాతం క్షీణించింది ► సహజ వాయువు : 12 శాతం క్షీణత నుంచి 20.6 శాతం వృద్ధికి మళ్లింది. ► రిఫైనరీ ప్రొడక్టులు : 8.9 శాతం క్షీణత 2.4 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది ► స్టీల్: 25 శాతం వృద్ధి సాధించింది. 2020 జూన్‌లో 23.2 శాతం క్షీణతలో ఉంది ► సిమెంట్: 6.8 శాతం క్షీణ బాట నుంచి 4.3 శాతం పురోగతి బాటకు మారింది ► విద్యుత్: 10% క్షీణత 7.2 వృద్ధికి మళ్లింది. తగ్గిన వృద్ధి స్పీడ్ ► ఎరువులు: 2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2020 ఇదే నెల్లో వృద్ధి 4.2 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో తగ్గడం గమనార్హం. మైనస్‌లోనే క్రూడ్ ఇక క్రూడ్ ఉత్పత్తి క్షీణతలోనే కొనసాగుతోంది. సమీక్షా నెల్లో 1.8 శాతం మైనస్ ఉత్పత్తి నమోదయ్యింది. అయితే 2020 జూన్‌తో పోల్చితే క్షీణత (– 6 శాతం) తగ్గడం కొంత ఊరట. మొదటి త్రైమాసికంలో... ఎనిమిది మౌలిక రంగాలు ఏప్రిల్–జూన్ మధ్య 25.3 శాతం వృద్ధి సాధించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 23.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఐఐపీ వృద్ధి 12 నుంచి 17 శాతం.. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వెయిటేజ్ దాదాపు 44 శాతంగా ఉంది. వచ్చే రెండు వారాల్లో వెలువడనున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలపై తాజా జూన్ మౌలిక రంగం ఫలితాలు సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జూన్ ఐఐపీ 12 నుంచి 17 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. లో బేస్ ఎఫెక్ట్‌తో పాటు జీఎస్టీ ఈ–వే బిల్లులు మెరుగుపడ్డం, ఆటో ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడం, కరోనా సెకండ్‌వేవ్ కేసులు తగ్గి పలు రాష్ట్రాల్లో సాధారణ వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డం వంటి అంశాలు కూడా జూన్ ఐఐపీ చక్కటి వృద్ధి రేటుకు దోహపడతాయని విశ్వసిస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
మౌలిక పరిశ్రమల మందగమనం
జనవరిలో 1.8% వృద్ధిరేటు న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ జనవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 13 నెలల కనిష్ట స్థాయిలో కేవలం 1.8 శాతం వృద్ధిని (2014లో ఇదే నెల విలువతో పోల్చితే) నమోదుచేసుకుంది. 2014 జనవరితో పోల్చి- 2015 జనవరిలో 8 రంగాల పనితీరునూ పరిశీలిస్తే... బొగ్గు: వృద్ధి 1.2% నుంచి 1.7%కి మెరుగుపడింది. క్రూడ్ ఆయిల్: 3% వృద్ధి రేటు -2.3% క్షీణతలోకి జారింది. సహజ వాయువు: -5.2% నుంచి -6.6%కి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు:-4.2% క్షీణత నుంచి 4.7% వృద్ధికి చేరింది. ఎరువులు: ఈ రంగం కూడా చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.1 శాతానికి పెరిగింది. స్టీల్: వృద్ధి రేటు 10.8% నుంచి 1.6%కి తగ్గింది. సిమెంట్: ఈ రంగంలో కూడా వృద్ధి 2 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 2.7 శాతానికి పడిపోయింది. 10 నెలల్లో...: కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో గ్రూప్ రంగాల వృద్ధి 4 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది. ఐఐపీలో 8 పరిశ్రమల వాటా 38 శాతం.