మౌలిక పరిశ్రమల మందగమనం
జనవరిలో 1.8% వృద్ధిరేటు
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ జనవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 13 నెలల కనిష్ట స్థాయిలో కేవలం 1.8 శాతం వృద్ధిని (2014లో ఇదే నెల విలువతో పోల్చితే) నమోదుచేసుకుంది. 2014 జనవరితో పోల్చి- 2015 జనవరిలో 8 రంగాల పనితీరునూ పరిశీలిస్తే...
బొగ్గు: వృద్ధి 1.2% నుంచి 1.7%కి మెరుగుపడింది.
క్రూడ్ ఆయిల్: 3% వృద్ధి రేటు -2.3% క్షీణతలోకి జారింది.
సహజ వాయువు: -5.2% నుంచి -6.6%కి పడిపోయింది.
రిఫైనరీ ప్రొడక్టులు:-4.2% క్షీణత నుంచి 4.7% వృద్ధికి చేరింది.
ఎరువులు: ఈ రంగం కూడా చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.1 శాతానికి పెరిగింది.
స్టీల్: వృద్ధి రేటు 10.8% నుంచి 1.6%కి తగ్గింది.
సిమెంట్: ఈ రంగంలో కూడా వృద్ధి 2 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గింది.
విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 2.7 శాతానికి పడిపోయింది.
10 నెలల్లో...: కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో గ్రూప్ రంగాల వృద్ధి 4 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది. ఐఐపీలో 8 పరిశ్రమల వాటా 38 శాతం.