కాంట్రాక్టు,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు
రోడ్డున పడనున్న వందలాది మంది ఉద్యోగులు
విజయనగరం ఆరోగ్యం,న్యూస్‌లైన్:
వైద్య విధాన్ పరిషత్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోనుంచి తొలగించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలోవైద్యులు, స్టాఫ్ నర్సులు,పారామెడికల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో వార్డు బాయ్‌లు, రేడియోగ్రాఫర్లు, సి.టి. స్కాన్ టెక్నీషియన్లు, థియేటర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.ై
వెద్య విధాన్ పరిషత్ అధీనంలో కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి, గజపతినగరం, భోగాపురం, బాడంగి, ఎస్.కోట,పార్వతీపురం ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుమారు 150 నుంచి 170 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరినీ ఈ నెలాఖరుకల్ల్లా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల నుంచి తొలగిస్తే పరిస్థితి ఏంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే ఉద్యోగం సంపాదిద్దామంటే వయో పరిమితి అయి పోయిన తర్వాత తమను ఎవరు తీసుకుంటారంటూ వాపోతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఆస్పత్రుల సేవలసమన్వయాధికారి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోనుంచి తొలగించాలని ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగాలు హుష్ కాకి
Published Wed, Mar 5 2014 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement