ప్రకాశం(ఇంకొల్లు): రుణాల కుంభకోణానికి సంబంధించి రామ్మోహన రావు, రామకోటేశ్వర రావు అనే ఇద్దరు బ్యాంకు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 2012లో బాండ్లు తాకట్టు పెట్టుకుని కోల్డ్ స్టోరేజీలకు రుణాలను మంజూరు చేశారు. సరుకులు లేకపోవడంతో యాజమాన్యాలు వాటిని ఇతరులకు అమ్మేశారు. సరుకులు లేకపోయినా వాటికి రుణాలు మంజూరు చేశారనే అభియోగాలపై వీరిని ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఇది రూ.43 కోట్ల కుంభకోణం.