
నోట్ల రద్దు...బ్యాంకర్లపై ఒత్తిడి
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఆర్‌బీఐ నుంచి తమకు ఒత్తిడి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా.. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అంతా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బ్యాంకర్లు.. పది రోజుల నుంచి డిపాజిట్‌లను స్వీకరించడం తప్ప తాము ఏ పనిచేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం, ఆర్‌బీఐల నుంచి తమకు తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు.