
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్‌లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(‘సాఫ్ట్‌వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ)
Comments
Please login to add a commentAdd a comment