బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త ఇది. వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉండాలన్న బ్యాంకు యూనియన్ల డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిశీలిస్తోందని, ఇది అమలయితే వారికి త్వరలో రెండు రోజుల వీక్లీ ఆఫ్‌లు లభిస్తాయని న్యూస్ 18 కథనం పేర్కొంది.
అయితే వారంలో ఐదు రోజుల పనిదినాల విధానం అమలైతే రోజువారీ పని గంటలను రోజుకు 50 నిమిషాలు పెంచవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్‌బీఈఎస్) మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసోసియేషన్ ఐదు రోజుల పనిదినాల విధానానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.
(ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..)
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానంలో ఉద్యోగులు రోజూ ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉండొచ్చని భావిస్తోంది.
మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్!
మార్చి నెలలో రెండవ, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా 12 రోజుల వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు సాధారణ సెలవులు ఉండగా మరికొన్నింటికి స్థానిక సెలవులు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!)
Comments
Please login to add a commentAdd a comment