Weekly off
-
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త! వారానికి రెండు రోజులు...
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త ఇది. వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉండాలన్న బ్యాంకు యూనియన్ల డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిశీలిస్తోందని, ఇది అమలయితే వారికి త్వరలో రెండు రోజుల వీక్లీ ఆఫ్‌లు లభిస్తాయని న్యూస్ 18 కథనం పేర్కొంది. అయితే వారంలో ఐదు రోజుల పనిదినాల విధానం అమలైతే రోజువారీ పని గంటలను రోజుకు 50 నిమిషాలు పెంచవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్బీఈఎస్) మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసోసియేషన్ ఐదు రోజుల పనిదినాల విధానానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. (ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..) నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానంలో ఉద్యోగులు రోజూ ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉండొచ్చని భావిస్తోంది. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్! మార్చి నెలలో రెండవ, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా 12 రోజుల వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు సాధారణ సెలవులు ఉండగా మరికొన్నింటికి స్థానిక సెలవులు ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడ? ఎప్పుడు అంటే?
మంత్రాలయం/ఆలూరు: గోవులను, ఎడ్లను పూజించడం హిందువుల సంప్రదాయం. ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను ఎద్దుల పండుగలుగా భావిస్తారు. ఆయా రోజుల్లో వాటికి స్నానాలు చేయించి, అలంకరణలు గావించి, పిండివంటలు పెట్టి పూజిస్తారు. మనకు ఇంత వరకే తెలుసు. కానీ జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న సుళేకేరి, విరుపాపురం గ్రామాల్లో ఎద్దులను ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. ఇలవేల్పు బసవేశ్వర స్వామి ప్రతి రూపాలుగా భావించి వారంలో ఒక రోజు పూర్తిగా సెలవు ఇచ్చేస్తారు. ఎంత పని ఉన్నా సోమవారం వాటితో చేయించరు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం. చదవండి: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్ కట్టుబాట్ల సుళేకేరి.. కౌతాళం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుళేకేరి గ్రామంలో అవధూత బంధమ్మవ్వ మహిమాని్వతురాలుగా ప్రసిద్ధి. అవ్వ పరమపదించిన తరువాత గ్రామంలో జాతరతో పాటు కొన్ని కట్టుబాట్లను పాటిస్తూ వస్తున్నారు. అవ్వ జాతరకు నెల రోజుల ముందు ఓ సామాజికవర్గం గ్రామ చావిడిలో చెప్పులు వేసుకుని నడవకపోవడం ఒక సంప్రదాయం కాగా మరొకటి ప్రతి సోమవారం ఎద్దులకు సెలువు ఇవ్వడం. దాదాపు 4 శతాబ్దాల క్రితం గ్రామంలో రైతులు యథావిధిగా ప్రతి రోజు పొలాలకు వెళ్లి కాడెద్దులతో పనులు చేసుకునేవారు. అయితే సోమవారం ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునేవి. కాడెద్దు చనిపోవడం, కాలు విరగడం, బండి ఇరుసులు, చక్రాలు విరగడం, రైతులకు గాయాలు కావడం జరిగేవి. దీంతో గ్రామంలోని అవధూత బంధమ్మవ్వకు గ్రామస్తులు గోడును వినిపించుకున్నారు. సోమవా రం కాడెద్దులను కష్టపెట్టడం మానేయాలని ఆమె ఆదేశించడంతో ఆ ఆజ్ఞను సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. విరుపాపురంలో విత్తు ఉన్నా సెలవే.. ఆలూరు నియోజకవర్గ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విరుపాపురం ఉంది. ఆ గ్రామ ఇలవేల్పు బలగోట బసవేశ్వర స్వామి. ఏటా ఏప్రిల్ నెలలో వచ్చే హంపయ్య పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర జరుపుకుంటారు. శివుని వాహనం బసవేశ్వరుడు కావడంతో గ్రామస్తులు బసవన్నలను దైవాలుగా పూజిస్తారు. ఇక్కడ 1975లో ఇందిరమ్మ గృహాలు రావడంతో విరుపాపురం పక్కనే బలగోట గ్రామం వెలసింది. విరుపాపురం గ్రామం రెండు గ్రామాలుగా ఆవిర్భవించడంతో బలగోట బసవేశ్వర స్వామి(బలగోటయ్య తాత) ఆజ్ఞగా భావించి ప్రతి సోమవారం కాడెద్దులకు సెలవు దినంగా ప్రకటించుకున్నారు. దాదాపు 5 శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచరిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా ప్రతి సోమవారం కాడెద్దులకు స్నానాలు చేయించడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, పిండి వంటలతో నైవేద్యాలు సమరి్పంచడం చేస్తున్నారు. అదే రోజు బలగోటయ్య స్వామి ఆలయానికి ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలతో ఎద్దులను తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. విత్తు వేసే పనులు ఉన్నా, పెళ్లిళ్లకు మెరవణిలు, ప్రయాణాలు ఉన్నా ఎద్దులతో పనులు చేయించరు. -
ఆఫ్‌లు ఆఫయ్యాయి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చిన అక్కడి ప్రభుత్వం 2019 నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తోంది. దాన్ని చూసిన ఇక్కడి అధికారులు ఆర్భాటంగా అమలులోకి తీసుకువచ్చారు. కానిస్టేబుళ్లకు పూర్తిస్థాయిలో, ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు ‘ప్రత్యేకంగా’ దీన్ని అమలు చేశారు. 2020లో కోవిడ్ ప్రభావంతో అమలైన లాక్డౌన్ నుంచి అదీ ఎత్తేశారు. ప్రస్తుతం పరిస్థితులు సాదారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ఇకనైనా ఉన్నతాధికారులు తమ ఆఫ్‌పై దృష్టి పెట్టాలని ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కోరుతున్నారు. ఆ రెండు స్థాయిలకు అనాలోచితంగా... రాజధానిలోని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ విధులకు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు సిబ్బంది సంఖ్యలో ఉన్న కొరతతో వీక్లీ ఆఫ్ అనేది ఊహించడానికీ సాధ్యమయ్యేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన భారీ రిక్రూట్మెంట్స్ ఫలితంగా సిబ్బంది కొరత కొంత వరకు తీరింది. దీంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఇక్కడా పోలీసులకు వీక్లీఆఫ్‌లు ప్రకటించారు. ఏఎస్సై స్థాయి వరకు సౌలభ్యాన్ని బట్టి వారంలో ఒకరోజు ఆఫ్ ఇస్తున్నారు. అయితే ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి వారికి మాత్రం నైట్‌డ్యూటీ తర్వాతి రోజును ఆఫ్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ అధికారులను నెలలో కనీసం నాలు గు రోజులు ఈ డ్యూటీలు ఉంటాయి. పరిస్థితు లు సజావుగా ఉంటే మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధుల్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్లినా విశ్రాంతి తీసుకోవడం తప్ప వ్యక్తిగత పనులు చూసుకోవడం, కుటుంబంతో గడపటం వంటివి దుర్లభంగా మారాయి. లాక్‌డౌన్‌తో వీక్లీ ఆఫ్ ఎత్తేశారు... కోవిడ్ మొదటి వేవ్ ప్రభావంతో 2020లో దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ అమలైంది. నగరంలో పక్కాగా అమలు చేయడానికి, వసల కార్మికులను తరలించడానికి, ఇక్కడ ఉన్న వారికి ఆహారం అందించడానికి... ఇలా అనేక అంశాల్లో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. దీంతో అన్ని స్థాయిల వారికీ వీక్లీ ఆఫ్ ఎత్తేశారు. లాక్డౌన్ ముగిసి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైల వరకు ఆఫ్ అమలు చేస్తున్నారు. ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల విషయమే ఎవరూ పట్టించకోవట్లేదు. ప్రస్తుతం కనీసం నైట్‌డ్యూటీ తర్వాతి రోజు ఆఫ్ తీసుకోవడానికీ ఆస్కారం లేకుండా పోయింది. పోలీసు విభాగంలో ఇతర ర్యాంకులు ఉన్నప్పటికీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకే కేసుల ఒత్తిడి ఉంటుంది. ఆపై స్థాయి అధికారులు అరుదైన కేసుల్లో మినహాయిస్తే మిగిలిన వాటిలో కేవలం పర్యవేక్షణ విధులు నిర్వర్తింస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారిపై అంత పని ఒత్తిడి ఉండదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలని ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కోరుతున్నారు. (చదవండి: 5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స ) -
పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, చెన్నై: రాష్ట్ర పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. రాష్ట్రంలో లక్ష మంది మేరకు పోలీసులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఆయా జిల్లాల్లో వారంలో ఏదో ఒక రోజు సెలవుతో పాటు, వివాహ, బర్తడే రోజుల్లో అనధికారింగా సెలవు ఇచ్చేవారు. అయితే, ఇది ఆచరణలో విఫలం కాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీఆఫ్ అనివార్యంగా సీఎం స్టాలిన్ భావించారు. చదవండి: (మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్) విధులను పక్కన పెట్టి వారంలో ఓ రోజుకు కుటుంబంతో గడిపేందుకు వీలుగా వీక్లీ ఆఫ్ అమలుకు సిద్ధం అయ్యారు. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ తీసుకునే అవకాశం కల్పించారు. సిఫ్ట్ పద్ధతిలో ఆయా స్టేషన్లలో సిబ్బంది వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. దీనిపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఓ గుర్తింపు చెన్నై డీజీపీ కార్యాలయం ఆవరణలో ప్రజల సేవ నిమిత్తం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులు ఆయా జిల్లాలకు పంపించి, పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాదిలో 1.12 కోట్ల ఫిర్యాదులు రావడం, వాటికి పరిష్కారం చూపడం రికార్డుకు ఎక్కింది. బ్రిటీష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఈ కంట్రోల్ రూమ్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను బుధవారం సీఎం స్టాలిన్ చేతుల మీదుగా డీజీపీ శైలేంద్ర బాబు, హోం శాఖకార్యదర్శి ప్రభాకర్ అందుకున్నారు. -
నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అన్నారు. ‘‘పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ‘‘పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాం. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచాం. గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 15 కోట్ల రూపాయలు విడుదల చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు. తప్పు చేస్తే ఎవర్ని వదలొద్దు: సీఎం జగన్ ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అతి ముఖ్యమైన విషయం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దు. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు. చట్టం ముందు నిలబెట్టండి. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో రాజీ పడొద్దు. రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నాం. అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు’’ అని సీఎం జగన్ సూచించారు.