కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Published Wed, Feb 12 2014 1:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : పదవ వేతన ఒప్పందం అమలు చేయాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జాతీయ, గ్రామీణ బ్యాం కుల ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. దీంతో జిల్లాలోని 26 బ్యాంకులకు చెందిన 232 బ్రాంచిల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. జిల్లా వ్యాప్తం గా బ్యాంకుల శాఖల ముందు ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచి ఎదుట యూఎఫ్‌బీయూ(యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐబీవోసీ నాయకుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ వేతనాల విషయంలో ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
నిరవధిక సమ్మె కు వెనుకాడబోమని హెచ్చరించారు. ఎన్‌సీబీఈ యూనియన్ నాయకుడు నరేంద్ర మాట్లాడుతూ గత సంవత్సరంలో బ్యాంకులు ఆర్జించిన లక్షా 62 వేల కోట్ల రూపాయల్లో ల క్షా 40 వేల కోట్ల రూపాయలను రుణఎగవేతదారులకు ప్రభుత్వం దోచిపెట్టిందని విమర్శించారు. మెరుగైన వేతన సవరణ చేయాలని అడిగితే మొండిచేయి చూపడం అన్యాయమన్నారు. ఏఐబీఈఏ నాయకుడు జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేసే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, బ్యాంకుల జాతీయీకరణ సవరణ చట్టాలను విరమించుకోవాలని డిమాండ్ చేశా రు. ఎస్‌బీఐ సంఘ నేతలు రమేష్, గౌరీశంకర్, ఏఐబీఈఏ నాయకులు శంకరరావు, బి.శ్రీనివాసులు, ఏపీజీవీబీ నాయకులు ఎం.వి.టి.నాగేశ్వరరావు, శర్మ, ఎన్‌సీబీఈ నాయకులు జగన్నా థం, గిరిప్రసాద్, మోహనరావు పాల్గొన్నారు.
Advertisement