ఆంధ్రాబ్యాంకు విలీనం దుర్మార్గపు ఆలోచన | Andhra Bank Employees Will Strike On 22nd Against Andhra Bank Merging | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకు విలీనం దుర్మార్గపు ఆలోచన

Published Sat, Oct 5 2019 9:40 AM | Last Updated on Sat, Oct 5 2019 9:40 AM

Andhra Bank Employees Will Strike On 22nd Against Andhra Bank Merging  - Sakshi

నిరసన తెలియజేస్తున్న ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రాబ్యాంక్‌ విలీనానికి వ్యతిరేకంగా ఆంధ్రాబ్యాంక్‌ అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఏఐబీఈఏ), బీఈఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 22న సమ్మె చేయనున్నట్లు ఏఐబీఈఏ డిప్యూటీ జోనల్‌ కార్యదర్శి బి.మోహనరావు తెలిపారు. బ్యాంక్‌ విలీనానికి వ్యతిరేకంగా ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది జీటీరోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను అగౌరవపరచడమేనన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమించి బ్యాంకును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాభాల్లో నడుస్తున్న బ్యాంకును వేరే బ్యాంకులో విలీనం చేయడం దుర్మార్గపు ఆలోచనగా దుయ్యబట్టారు. నిరసన ప్రదర్శనలో ఏఐబీఈఏ మహిళా కార్యదర్శి జి.కరుణ, సహాయ కార్యదర్శి ఎన్‌.ఎం.కె రాజు, సంతోషి, జయరాం, రెడ్డి, దీపిక, బ్యాంక్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement