ఎస్‌బీఐ ఎదుట బ్యాంకర్ల ఆందోళన
Published Thu, Feb 23 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
కర్నూలు(అగ్రికల్చర్): వివిధ డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం కర్నూలు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట భోజన విరామ సమయంలో బ్యాంక్ సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆప్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అన్ని బ్యాంకులకు తగిన నగదు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ఆర్‌బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే కొంతమంది పెద్దలకు కరెన్సీ వెళ్లిపోయిందని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న చేపట్టే బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, మోహన్, ఎల్లయ్య, ఇతర బ్యాంకుల నాయకులు పాల్గొన్నారు,
Advertisement
Advertisement