బంగారం వేలంపాట రద్దు చేయండి
కర్నూలు : ఓవైపు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు, బంగారం పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెబుతుంటే.. మరోవైపు తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని బ్యాంకులు... రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. దాంతో కర్నూలు జిల్లాలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగారం వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు సోమవారం ఉదయం ఆస్పరిలోని ఎస్బీఐ బ్యాంకును ముట్టడించారు. అయితే రైతుల అభ్యర్థనను బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.