అన్నదాతకు ఒత్తిళ్లు | SBI BANK Notices on Farmers Loans | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఒత్తిళ్లు

Published Fri, Nov 7 2014 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

అన్నదాతకు  ఒత్తిళ్లు - Sakshi

అన్నదాతకు ఒత్తిళ్లు

రుణమాఫీ అమలు కాకపోగా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ నోటీసులు అందుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు రుణాలు చెల్లించని రైతులపై దావాలు వేసేందుకు సన్నద్ధమవుతుంటే పలు వాణిజ్య బ్యాంకులు రుణాల వసూలు కోసం రైతులపై ఒత్తిడిని పెంచాయి.
 
 కొవ్వూరు :రైతులు తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ తాళ్లపూడి మండలంలో ప్రక్కిలంక, పోలవరం ఎస్‌బీఐ శాఖలతోపాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల బ్యాంకులు మైక్ ద్వారా ప్రచారం చేశాయి. ఇటీవల కొవ్వూరు మండలం వాడపల్లిలోని బ్యాంకు ఆఫ్ ఇండియా రైతులకు నోటీసులను జారీచేసింది. ఈ బ్యాంకు  వాడపల్లి, మద్దూరు గ్రామాల పరిధిలో సుమారు 150 మంది రైతులను డిఫాల్టర్లు (గడువు మీరినా రుణాలు చెల్లించనివారు)గా గుర్తించి నోటీసులు బట్వాడా చేసింది. జిల్లావ్యాప్తంగా బ్యాంకర్లు, సహకార సంఘాలు రుణాల చెల్లించాలని రైతులను ఇళ్లకు వెళ్లి మరీ ఒత్తిడి చేస్తుండడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ పంటకాలం ముగుస్తున్నా రుణ మాఫీ అమలు కాలేదు.
 
 పాతరుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులకు గత సీజన్‌లో కొత్తరుణాలు ఇవ్వలేదు. దీంతో ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు అప్పులు తెచ్చుకుని పంటలు సాగు చేశారు. రబీ సీజను ప్రారంభమవుతున్న తరుణంలో రుణమాఫీ ఎప్పటిలోగా అమలవుతుందో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. డ్వాక్రా మహిళలకూ ఒత్తిళ్లు మరోవైపు రుణాల వసూలుకు బ్యాంకు అధికారుల నుంచి డ్వాక్రా మహిళలపై కూడా ఒత్తిళ్లు పెరిగాయి. కొన్ని సంఘాల పొదుపు సొమ్మును వడ్డీ కింద జమచేసుకుంటున్నారు. రుణం పొందిన బ్యాంకులో బంగారు ఆభరణాలుంటే వాటిని బహిరంగ వేలం వేసైనా బకాయి జమ చేసుకోమని ఆదేశాలున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బ్యాంకు ఉన్నతాధికారి తెలిపారు.
 
 రూ.4 లక్షలు తీసుకుంటే రూ.8 లక్షలంటూ నోటీసులు
 మద్దూరు గ్రామానికి చెందిన బాల వినాయక రైతుమిత్ర గ్రూపునకు చెందిన పదిమంది సభ్యులు వాడపల్లిలోని బ్యాం కు ఆఫ్ ఇండియాలో 2011 మార్చి 30న రూ.నాలుగు లక్షల రుణం తీసుకున్నారు. గత నెల 20వ తేదీన ఒక్కొక్కరూ రూ.8 లక్షల రుణం తీసుకున్నట్టు బ్యాంకు నుంచి నోటీసులు అందడంతో రైతులు లబోదిబోమంటున్నారు.ఒక్కో సభ్యుడు రూ.40 వేలు చొప్పున రూ.నాలుగు లక్షల రుణం తీసుకున్నామని పంట బీమా పేరిట ఇచ్చిన రూ.27,950లు కలిపి మొత్తం రూ.4,27,950 రుణానికి గాను బ్యాంకు రూ.8 లక్షల రుణం చెల్లించాలని నోటీసులు ఇచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఏడాది వడ్డీ చెల్లించామని, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రెండో సంవత్సరం రుణం చెల్లించలేకపోయామని రైతులు చెప్పారు. తాము కౌలు రైతులం కావడం వల్ల సకాలంలో రుణం చెల్లించలేకపోయామన్నారు. చంద్రబాబును ఓట్లు వేసి గెలిపిస్తే మాఫీ చేయకుండా మోసగించారని ఆవేదన వెలిబుచ్చారు. రుణం తీసుకున్న ఏడాది తర్వాత నుంచి బ్యాంకు చ క్రవడ్డీ వసూలు చే స్తోందని తద్వారా రుణం వడ్డీతో కలిసి తడిసిమోపెడు అయ్యిందని ైరె తులు మండిపడుతున్నారు.
 
 పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తాం
 బ్యాంకులో రుణాలు తీసుకుని గడువు మీరిన రైతులకు సుమారు 150 మందికి నోటీసులు ఇచ్చాం. రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతుల ఆధార్ డేటా పంపించమంటే పంపా. కొందరి వివరాలు సక్రమంగా లేకపోవడంతో సరిచేసి పంపించార . బ్యాంకు పరిధిలో రైతుల నుంచి సుమారు రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షలు మేరకు గడువు మీరిన రుణాలు వసూలు కావాల్సి ఉంది. మద్దూరు రైతుమిత్ర సంఘానికి రూ.నాలుగు లక్షలే ఇచ్చాం. పొరబాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తాం.
 - వీఎస్‌వీవీఎస్ ప్రసాద్,
 బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాడపల్లి
 
 ఒత్తిడి చేస్తున్నారు
 మా రైతు సంఘం ద్వారా రూ.నాలుగు లక్షలు రుణం తీసుకుంటే రూ. ఎనిమిది లక్షలు తీసుకున్నట్లు నోటీసులు పంపిం చారు. బ్యాంకు అధికారులను అడుగుతుంటే ముం దు రుణం కట్టండని ఒత్తిడి చే స్తున్నారు. కౌలు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో సకాలంలో రుణం చెల్లించలేక పోయాం.
 కోసూరి నాగే శ్వరరావు, కన్వీనర్, బాల వినాయక రైతు మిత్ర సంఘం, మద్దూరు
 
 వీధి పాలు చేశారు
 రుణమాఫీ పేరిట రైతులను ప్రభుత్వం వీధి పాలు చేసింది. ఖరీప్ సీజ న్‌లో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. రబీ సీజను ప్రారంభమవుతోంది. మాఫీపై ప్రభుత్వం పూటకో మాట చెబుతోంది. రైతులకు అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది.
 -కంఠంశెట్టి కృష్ణారావు, రైతు, మద్దూరు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement