పుంగనూరుటౌన్ : పుంగనూరు పట్టణంలోని రుణమాఫీ లబ్ధిదారులు తమ రుణాలను మాఫీ చేయాలంటూ ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట సొమవారం ధర్నా చేశారు. ధర్నాలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పాల్గొన్నారు. తమకు రుణమాఫీ అవుతుందని పత్రాలు చేతికిచ్చారని కానీ ఇంత వరకు ఒక్కపైసా మాఫీ కాలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అధికారులను సంప్రదించినా సరైన సమాచారం లేదన్నారు. రుణమాఫీకి అర్హులైన వారిని గుర్తించి, న్యాయం చేయాలని కోరారు.
ఈ విషయంపై స్పందించిన బ్యాంకు మేనేజర్ వి.బి.శ్రీరామ్ మొదటివిడతలో 1,937 మందికి సంబంధించిన ఖాతాల్లో డబ్బులు జమచేశామని రెండో విడుతకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు, నిధులు ఇంకా తమకు అందలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆరంట్లపల్లె, నేతిగుట్లపల్లె, పాళ్యెంపల్లె, బోడేవారిపల్లె, మిట్టపల్లె, ఎర్రప్పశెట్టిపల్లె, పెద్దయల్లకుంట్ల, గుండ్లపల్లెలకు చెందిన రుణమాఫీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
రుణ మాఫీ కోసం బ్యాంకు ఎదుట రైతుల ధర్నా
Published Tue, Apr 7 2015 4:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement