God Make the Entire Creation In One Hour, But Make Female Took A Week - Sakshi
Sakshi News home page

యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?

Published Sat, Jul 15 2023 11:45 AM | Last Updated on Sat, Jul 15 2023 4:40 PM

God Make Entire Creation In One Hour But Make Female Took A Week - Sakshi

యావత్తు సృష్టిని ఒక్క గంటలో తయారుచేయగలిగిన దేవుడు "స్త్రీ మూర్తిని" తయారుచేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడట ఎందుకో తెలుసా!.. మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక "స్త్రీ"ని సృష్టించడం మొదలు పెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు. "స్త్రీ" సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు ఇంతగా తలమునకలై పోవడం చూసిన దేవత అడిగింది. "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". అప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా అంటూ 'ఆమె శక్తి' గురించి చెప్పుకొచ్చాడు ఇలా..

శారీరీకంగా కోమలమైంది మానసికంగా..
ఇష్టాయీష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈజీవి ఎదుర్కోవాలో తెలుసా. ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా. ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే" అన్నాడు. "ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. ఆప్పుడు దేవుడు"ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు.

అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమ, అనురాగాలను." అన్నాడు. "ఓహో ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు"ఎందుకాలోచించదు అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు." అన్నాడు. దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా ఏంటిది? " అని అడిగింది.

ఆమె కన్నీటికి ఉన్న శక్తి అనంతం..
అప్పుడు దేవుడు "అదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవీకి ప్రాణం పోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే." అని చెప్పింది. అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకూ తెలియనట్టే ఉంటుంది." అవసరమైనప్పుడు ఆ శక్తి ముందూ ఎవరూ నిలబడలేరు అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని. అందుకనే ఏమో} స్త్రీని పుడమితల్లితో పోల్చారు.

(చదవండి: 'రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement