![Amazon asks corporate staff to be in offices 3 days a week - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/18/amazon%20andy%20jassy.jpg.webp?itok=2-kiuETy)
సాక్షి,ముంబై: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కార్పొరేట్ ఉద్యోగులను కోరింది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఫిబ్రవరి 17న సిబ్బందికి మెమో ద్వారా సమాచారం అందించారు. ఈ విధనం మే 1 నుంచి అమల్లోకి రానుంది.
ఎక్కువ సమయం ఆఫీసులో, సహోద్యోగులతో కలిసి ఉన్నప్పుడు నేర్చుకోవడానికి, సంస్కృతిన బలోపేతం కావడానికి ఎక్కువ దోహదపడుతుందని జెస్సీ తెలిపారు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సహకారంతో కొత్త ఆవిష్కారాలుసులభమవుతాయనీ, వ్యక్తిగతంగా ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడం ఈజీ అని పేర్కొన్నారు. అలాగే తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని ఆండీ జెస్సీ బ్లాగ్ పోస్ట్ సందేశంలో పేర్కొన్నారు.
కాగా గ్లోబల్‌గా కరోనా పరిస్థితి చక్కబడుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. గత నెలలో, స్టార్‌బక్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కోరింది.డిన్నీ కూడా వారానికి నాలుగు రోజులు ఆఫీసు నుంచి పని విధానం మార్చినుంచి ప్లాన్ చేసుకోవాలని డిస్నీ ఉద్యోగులను కోరుతోంది. వాల్‌మార్ట్ రెగ్యులర్ ఇన్-ఆఫీస్ పని దినాలను ప్లాన్ చేసు కోవాలని ఇటీవల తన టెక్ టీంలకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment