ఢిల్లీ: కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న రికార్డుస్థాయిలో 357 కరోనా మరణాలు సంభవించాయని కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలో మృత్యుఘోష ఆగడం లేదు. ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ అందక కన్నుమూశారు.
చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు
ఢిల్లీలో ఆగని మృత్యుఘోష
Comments
Please login to add a commentAdd a comment