
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. తాజాగా శనివారం 956 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఢిల్లీలో వెయ్యి కేసుల కంటే తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే మే 31 నుంచి రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో లాక్‌డౌన్ నియంత్రణలో భాగంగా మరిన్ని సడలింపులు ఇస్తామని శనివారం మీడియాకు తెలిపారు.
''కరోనా తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. లాక్‌డౌన్ నియంత్రణలో మరిన్ని సడలింపులు చేపట్టనున్నాం. ఇందులో భాగంగా ఢిల్లీలో మరిన్ని కార్యకలాపాలకు రానున్న రోజుల్లో అనుమతించనున్నాం. సెకండ్ వేవ్ వ్యాప్తితో లాక్ డౌన్ ప్రకటించిన రోజున ఢిల్లీలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 27 శాతం ఉండగా ఇప్పుడది 2 శాతం లోపు పడిపోవడం ఊరట కలిగిస్తోంది.'' అని తెలిపారు.
చదవండి: ఢిల్లీకి వ్యాక్సిన్ సరఫరాకు స్పుత్నిక్-వి అంగీకారం
Comments
Please login to add a commentAdd a comment