వారం రోజులపాటు కారులోనే దాగి ఉన్న కోబ్రా... బిత్తరపోయిన యజమాని | Cobra Travelled 200 Kms Live Car Engine Bay At Kerala | Sakshi
Sakshi News home page

వారం రోజులపాటు కారులోనే దాగి ఉన్న కోబ్రా... బిత్తరపోయిన యజమాని

Published Wed, Aug 31 2022 8:28 PM | Last Updated on Wed, Aug 31 2022 8:29 PM

Cobra Travelled 200 Kms Live Car Engine Bay At Kerala - Sakshi

తిరువనంతపురం: కేరళలోని ఆర్పూకర నివాసి సుజిత్‌ ఆగస్టు 2న మలప్పురం వెళ్లారు. అక్కడ వజికడవు చెక్‌పోస్ట్‌ వద్ద తన కారు ఆగింది. ఆ సయమంలోనే ఒక విషసర్పం కారు వద్దకు వచ్చి అందులో దాగి ఉంది. ఈ విషయం తెలియని కారు యజమాని సుజిత్‌ ఆర్పూకర్‌లో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. సుజిత్‌ ఒక రోజు కారులో వేలాడుతున్న కుబుసం చూసి ఒక్కసారిగా హడలిపోతాడు.

దీంతో ఈ విషసర్పం ఇక్కడే ఎక్కడే సంచరిస్తుందని సుజిత్‌ తన ఇంటి కాంపౌండ్‌ని, కారుని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. అయినా ప్రయోజం ఉండదు. దీంతో సుజిత్‌ కుటుంబం ఒకింత భయబ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని తన చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశాడు. ఐతే అక్కడ ఉన్న కొంతమంది స్థానికు పాము కారు వద్ద ఉండటం చూశామని చెప్పడంతో వన్యప్రాణుల సిబ్బందిని పిలిపించారు.

వారు వచ్చినప్పుడూ గానీ తెలియలేదు పాము ఎక్కడ ఉందనేది. ఆ విషసర్పం ఏకంగా కారు ఇంజన్‌ బేస్‌లో ఉంది. బహుశా వజికడుపు చెక్‌ పోస్ట్‌ వద్ద ఆగినప్పుడే ఈ పాము వచ్చి ఉంటుందని భావించారు అంతా. అంతేకాదు ఈ పాము ఏకంగా కారు ఇంజన్‌ బేలోనే వారం రోజులపాటు ఉంది. అలాంటి విషసర్పం సంచరించని ప్రదేశంలోకి వస్తే ఎవరైన కలవరపాటుకి గురవ్వడం సహజమే.

(చదవండి: బస్సులో నుంచుని వెళ్లడం ఇష్టం లేక...ఏం చేశాడంటే...)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement