
హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తెలంగాణ కేబినేట్ జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు.. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తరగతులను మాత్రం నేరుగా క్లాసులను నిర్వహించనున్నారు.
అదే విధంగా, స్కూళ్లు, జూనియర్ కాలేజీల అంశంపై మాత్రం విద్యాశాఖ కాస్త మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటామని టీఎస్ సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: తెలంగాణలో దళితుల ప్రాణాలకు విలువ లేదా?
Comments
Please login to add a commentAdd a comment