![Eiffel Tower Reopens After Three Months - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/25/Eiffel-Tower.jpg.webp?itok=eq6fPiDb)
కరోనా ప్రభావంతో మూతపడ్డ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ గురువారం రోజున తిరిగి ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తర్వాత ఈఫిల్ టవర్‌కు సందర్శకుల తాకిడి మొదలైంది. కానీ సందర్శకులు టవర్ యొక్క రెండవ అంతస్తు కంటే పైకి వెళ్ళడానికి అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే తొలుత మెట్ల మార్గం ద్వారానే ఈఫిల్ టవర్‌ను సందర్శించే అవకాశం కల్పించారు. మరోవైపు సందర్శకుల సంఖ్యను కూడా పరిమితం చేయనున్నారు.
ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈఫిల్ టవర్ పరిసరాల్లో పరిశుభ్రతతోపాటు అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టారు. భద్రత కారణాల దృష్ట్యా ఎలివేటర్లను కొంతకాలం పాటు మూసి ఉంచనున్నట్టు తెలిపారు. పదకొండేళ్లు దాటిన వారు ఫేస మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతకాలం పాటు ఈఫిల్ టవర్‌ను మూసివేయడం ఇదే తొలిసారి. ప్రపంచం నలుమూలల నుంచి ఈఫిల్ టవర్‌ను చూసేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు పారిస్‌కు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment