ముంబై: కరోనా మహమ్మారి కారణంగా మార్చి నుంచి మూసివేయబడిన దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ దీపావళి తర్వాత స్కూళ్లు (9 నుండి 12 తరగతులకు) తిరిగి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. (బీజేపీకి సవాల్.. దమ్ముంటే తీసుకెళ్లండి!)
నవంబర్ 17 నుంచి 22 మధ్య రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలలను ఈనెల 23న తెరుస్తామని, విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామన్నారు. ఒక్కో బెంచికి ఒక్క విద్యార్థిని మాత్రమే కూర్చోనిస్తామని తెలిపారు. తరగతులను రోజు విడిచి రోజు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి ప్రారంభంపై సీఎం స్పందిస్తూ త్వరలోనే కోవిడ్ నిబంధనలను రూపొందించి దేవాలయాలను తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. దేవాలయాలు ప్రారంభించడం వల్ల వృద్ధులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగల సీజన్‌లో దేవాలయాలకు వచ్చే భక్తుల రద్దీని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment