
సాక్షి ,న్యూఢిల్లీ : కోవిడ్-19తో మూతపడిన కాలేజ్‌లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెరదించింది. కళాశాలల పునఃప్రారంభంపై బుధవారం కీలక ప్రకటన వెల్లడించింది. కరోనా మహమ్మారితో మూతపడిన కాలేజ్‌లు ఆగస్ట్‌లో తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
నూతన విద్యార్ధుల ప్రవేశాలను సెప్టెంబర్ నుంచి చేపట్టాలని పేర్కొంది. కాగా సెప్టెంబర్ నుంచి నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తారని ఇటీవల పలు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మరోవైపు పెండింగ్ పరీక్షల గురించి యూజీసీ ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment