న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ తెరవాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా వైరస్‌తో కలిసి జీవించడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం మీడియాతో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. మొత్తం ఢిల్లీని కాకుండా కంటైన్‌మెంట్ ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికిప్పుడు ఆగిపోదని అన్నారు. కరోనా కేసులు సున్నాకు చేరడం అసాధ్యమని తేల్చిచెప్పారు. అందుకే మనమంతా కరోనాతో కలిసి జీవించక తప్పదన్నారు. లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు లేక ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారని, వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేజ్రీవాల్ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment