
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్ల పునరుద్ధరణకు అనుమతించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా కోవిడ్-19 నిబంధనలతో వారాంతపు సంతలను అనుమతిస్తామని డీడీఎంఏ పేర్కొంది. జిమ్‌లను తెరిచేందుకు మాత్రం అనుమతించలేదు.
దేశ రాజధానిలో కరోనా వైరస్ నెమ్మదించిన క్రమంలో హోటళ్లు, జిమ్‌లు, వారాంతపు సంతలను అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) అనిల్ బైజల్‌కు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకునే హక్కు తమకుందని ఆప్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో నగర ప్రజలను వారి జీవనోపాధికి దూరంగా ఉంచరాదని రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌జీని కోరింది. చదవండి : మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత
Comments
Please login to add a commentAdd a comment