
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి(బుధవారం)నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూళ్లు మినహా మిగతా పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీచేసింది.
గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూళ్లు మినహా మిగతా వాటికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆఫ్‌లైన్‌తో పాటు అన్‌లైన్‌లోనూ స్కూళ్లు కొనసాగుతాయని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు రెసిడెన్షియల్, గురుకులాలను మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
చదవండి: తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment