చెన్నై : రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. ఇంతకుముందు ఈనెల 16నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయని, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు హాజరుకావాల్సిందిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థిత్లుల్లో స్కూళ్లకు అనుమతిస్తే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. స్కూళ్లు తిరిగి ప్రారంభించాలా వద్దా అన్నఅంశంపై దాదాపు 12వేల పాఠశాలలు సమావేశం అయినట్లు అధికారులు వెల్లడించారు. (భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment