
రష్యాలో మార్చిలో మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. అయితే, ‘కుస్నో ఈ టొచ్కా (రుచికరమైన సమయం)’ అనే కొత్త పేరుతో, సరికొత్త లోగోతో! రష్యా కుబేరుడు అలెగ్జాండర్ గొవోర్ దాన్ని కొనుగోలు చేశారు.
ఆదివారం నుంచి మాస్కో సహా పలుచోట్ల ఔట్‌లెట్లు తెరుచుకున్నాయి. దాంతో వాటిలోకి జనం విరగబడ్డారు. మూతబడ్డ 800పై చిలుకు ఔట్‌లెట్లలో 200 దాకా నెలాఖరుకల్లా తెరుచుకుంటాయని యాజమాన్యం చెప్తోంది.