McDonalds Restaurant
-
McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో!
రష్యాలో మార్చిలో మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. అయితే, ‘కుస్నో ఈ టొచ్కా (రుచికరమైన సమయం)’ అనే కొత్త పేరుతో, సరికొత్త లోగోతో! రష్యా కుబేరుడు అలెగ్జాండర్ గొవోర్ దాన్ని కొనుగోలు చేశారు. ఆదివారం నుంచి మాస్కో సహా పలుచోట్ల ఔట్లెట్లు తెరుచుకున్నాయి. దాంతో వాటిలోకి జనం విరగబడ్డారు. మూతబడ్డ 800పై చిలుకు ఔట్లెట్లలో 200 దాకా నెలాఖరుకల్లా తెరుచుకుంటాయని యాజమాన్యం చెప్తోంది. -
మాల్స్‌ను వీడి... వీధుల్లోకి రెస్టారెంట్లు
కోవిడ్-19 కారణంతో మాల్స్‌లో ఉన్న రెస్టారెంట్లు వీధుల్లోకి రానున్నాయి. ఒకప్పుడు వీధుల్లో ఎంతో ఆహ్లాందంగా సాగే హోటల్ వ్యాపారాలన్నీ పెద్దపెద్ద మాల్స్, అద్దాల భవనాల్లో ఎంతో ఆకర్షనీయంగానేగాక, ఖర్చుపరంగా సమాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగాయి. తాజాగా కోవిడ్ మహమ్మారీ విజృంభణతో వోల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చందనా ..ఇప్పట్లో మాల్స్ తెరిచే పరిస్థితి లేకపోవడంతో పేరుమోసిన పెద్దపెద్ద రెస్టారెంట్లన్నీ వీధుల్లో తమ స్టాళ్లను తెరిచేందుకు ప్రయతిస్తున్నాయి.2000 సంవత్సంరం మొదట్లో వీధుల్లో ఉన్న రెస్టారెంట్లు మాల్స్‌లోకి వెళ్తే.. 2020లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా అవే రెస్టారెంట్లు వీధుల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ డైనింగ్ అండ్ క్యూఎస్ఆర్ చెయిన్ మెక్‌డోనాల్డ్స్, స్పెషాలిటీ రెస్టారెంట్లు, డిగస్టీబస్, లైట్ బైట్ ఫుడ్స్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపించేందుకు మాల్స్ మంచి హాట్ స్పాట్ సెంటర్లు అయ్యే ప్రమాదం ఉన్నందున మాల్స్‌ను తెరవడం లేదు. ఒక వేళ మాల్స్‌ను ఓపెన్ చేసినప్పటికీ వ్యాపారాలు నిర్వహించడానికి సమయం పరంగా కొన్ని నిబంధనలు, నియంత్రణలు ఉన్నాయి. దీంతో రెస్టారెంట్లకు ఇంది పెద్ద ఇబ్బంది కలిగించే అంశమే. మరోపక్క మాల్స్‌లో ఏర్పాటు చేసే ఫుడ్‌కోర్టులకు రెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే వీధుల్లో అయితే తక్కువ ఖర్చుతో రెస్టారెంట్లను నడపవచ్చు. ఈ మూడు కారణాలతో మాల్స్‌లో ఉన్న బడా రెస్టారెంట్లన్ని వీధులు వంక చూస్తున్నాయి. 30-40 శాతంగా మాత్రమే.. కొన్ని ప్రాంతాల్లో ఎవరితో కలవకుండా సొంతంగా రెస్టారెంట్లు ఓపెన్ చేసేందుకు కొన్ని సంస్థలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అంతేగాకుండా ఫుడ్‌ను హోం డెలివరీ కూడా చేయనున్నాయి. ఉత్తర, తూర్పు భారతదేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్‌కు 155 రెస్టారెంట్లు ఉన్నాయని కనౌట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్(సీపీఆర్ఎల్) చైర్మన్ సంజీవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే మెక్‌డోనాల్డ్ తన 17 రెస్టారెంట్లను డ్రైవ్-త్రూస్ ప్రాంతాల్లో ప్రారంభించిందని, ఇంకా వీటికి సంబంధించిన మరికొన్ని పనులు పూర్తికావాల్సి ఉందన్నారు. ఒక వేళ మాల్స్ ఓపెన్ చేసినప్పటికీ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభంలో లాక్‌డౌన్‌కి ముందుతో పోలిస్తే 30-40 శాతంగా మాత్రమే సాగుతుందని మెయిన్‌లాండ్, ఓ క్యాల్‌కటా రెస్టారెంట్లను నడిపే స్పెషాలిటీ రెస్టారెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్జన్ చటర్జీ అన్నారు. అంతేగాకుండా మాల్స్‌లో రెస్టారెంట్ల వల్ల లాభాలతోపాటు నష్టాలుకూడా ఉన్నాయన్నారు. మాల్స్‌కు వచ్చే వారంతా తప్పకుండా అక్కడ ఉన్న రెస్టారెంట్లలో తినడానికి ప్రాధాన్యమిస్తారని తెలిపారు. సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలి.. మాల్ యజమానులకు వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలని, అద్దెలు మాఫీ, రెవెన్యూ షేర్ మోడళ్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోని సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలని చెబుతూ ఈ మేరకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేష్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) ఒక లేఖ రాసింది. మరోపక్క ఇప్పటికే అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో మా రెస్టారెంట్లను నడపడంలేదని, అద్దె ఖర్చులు తగ్గించుకునేందుకు త్వరలోనే మాల్స్ నుంచి మా రెస్టారెంట్లను తరలించనున్నామని గస్టీబస్ సీఈఓ ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ అనురాగ్ కత్రియార్ వెల్లడించారు. పంజాబీ గ్రిల్, స్ట్రీట్ ఫుడ్స్, జమ్‌బార్‌లను నిర్వహించే లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ..అద్దెలు కట్టలేక మాల్స్‌లో ఉన్న స్టోర్లను మూసివేసామని తెలిపారు. వీధుల్లో రెస్టారెంట్లు నిర్వహించడమే అన్ని విధాలుగా సులభమని కేఫ్ ఢిల్లీ హైట్స్ సహవ్యవస్థాపకులు శారద్ బాత్ర అన్నారు. -
ఫ్రీ సోడా కోసం ఆడవాళ్ల మధ్య భీకర పోరు
న్యూయార్క్ : సోడా కోసం ఇద్దరు ఆడవాళ్ల మధ్య మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానై భీకర పోరుకు దారి తీసింది. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా ఉన్న గొడవ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌కు ఓ యువతి వెళ్లింది. ఫ్రీ సోడా తాగటానికి ఓ వాటర్ గ్లాస్ ఇవ్వాల్సిందిగా యువతి అక్కడున్న రెస్టారెంట్ ఉద్యోగినిని అడిగింది. అయితే ఆ ఉద్యోగిని అందుకు ఒప్పుకోలేదు. ఏమైనా కొనుగోలు చేస్తే గ్లాసు ఇస్తానని ఆ యువతికి చెప్పింది. అయితే ఫ్రీ సోడా ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన ఆ యువతి ఆమెను దుర్భాషలాడింది. అక్కడనున్న చిప్స్‌ను ఆమెపై విసురుతూ ఎగతాళి చేస్తూ మాట్లాడింది. యువతి మాటలకు కోపం తెచ్చుకున్న ఆ ఉద్యోగిని ఆమెపైకి ఉరికింది. యువతిని బల్లపైకి తోసి మొహంపై పిడిగుద్దులు గుద్దింది. డబ్ల్యూడబ్ల్యూఈకి ఏమాత్రం తీసిపోని విధంగా కొద్దిసేపు ఇద్దరి మధ్య భీకర పోరు నడిచింది. ఇంతలో యువతిని పక్కకు లాగుతున్న ఓ మహిళపై కూడా ఆ యువతి తిరగబడటంతో ఆమె కూడా రెండు దెబ్బలు వేసింది. అయినా ఆ యువతి ఏమాత్రం తగ్గలేదు సరికదా కుర్చీ తీసుకుని ఉద్యోగినిపై దాడికి వెళ్లింది. అయితే ఆ ఉద్యోగిని కుర్చీ లాక్కొని గొడవను సద్దుమనిగేలా చేసింది. -
ఆఫ్రిది బిల్లు చెల్లించిన అభిమాని!
కరాచీ: మామూలుగా క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా... డబ్బులకు ఏమాత్రం కొదువ ఉండదు. కానీ కొన్ని సమయాల్లో ఎంత డబ్బున్నా... అది ఉపయోగపడకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో పాకిస్తాన్ టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి బాగా ఆర్థమైంది. క్రికెట్ పర్యటన కోసం న్యూజిలాండ్ వెళ్లిన ఆఫ్రిది... సహచరుడు అహ్మద్ షెహజాద్‌తో కలిసి సోమవారం ఆక్లాండ్ విమానాశ్రయంలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. మీల్స్ ఆర్డర్ చేశాక డబ్బులు ఇవ్వడానికి వెళ్తే జేబులో మొత్తం యూఎస్ కరెన్సీ మాత్రమే ఉంది. అయితే రెస్టారెంట్లో స్థానిక కరెన్సీ మాత్రమే తీసుకుంటుండడంతో క్రికెటర్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆర్డర్ క్యాన్సిల్ చేయలేక.. డబ్బులు కట్టలేక దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో.. ఇదంతా గమనించిన వకాస్ నవీద్ అనే ఓ అభిమాని వచ్చి బిల్లును చెల్లించడంతో ఆఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు. రెస్టారెంట్ ఎపిసోడ్‌ను ఎవరో రహస్యంగా చిత్రీకరించి మీడియాకు ఇవ్వడంతో విషయం మొత్తం బయటకు వచ్చేసింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే కివీస్ బయలుదేరటానికి ముందు లాహోర్‌లో ఆఫ్రిది.. మీడియాతో గొడవపడటం. తాము అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో మీడియా మొత్తం గడాఫీ స్టేడియం వద్ద నిరసనకు దిగింది. ఇక రెస్టారెంట్ ఎపిసోడ్ దొరకడంతో పాక్ మీడియా మొత్తం ఆఫ్రిదిని ఓ ఆటాడేసుకుంది. -
కోక్ కొందామని వస్తే.. తోసిపారేశారు!
పెద్ద పెద్ద పేర్లతో వస్తున్న బహుళ జాతీయ రెస్టారెంట్లు మన దేశంలో ఉన్న బడుగు జీవులను చిన్నచూపు చూస్తున్నాయి. ఈ విషయం మహారాష్ట్రలోని పుణె నగరంలో స్పష్టంగా రుజువైంది. అక్కడి మెక్ డోనాల్డ్ రెస్టారెంటు ఉద్యోగులు.. కోక్ కొనేందుకు వచ్చిన ఓ వీధి బాలుడిని మెడపట్టుకుని బయటకు గెంటేశారు. అలాంటివాళ్లకు తమ రెస్టారెంటులో చోటు లేదని స్పష్టం చేశారు. ఈ ఘోరంపై దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకోవాలని తాను ఇప్పటికే ఆదేశించానని, ప్రస్తుతం తనకు కూడా అన్ని విషయాలు తెలియవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఈ మొత్తం విషయాన్ని షహీనా అత్తర్వాలా అనే మహిళ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఆమె తన స్నేహితులతో కలిసి మెక్ డోనాల్డ్ రెస్టారెంటుకు వెళ్లినప్పుడు అక్కడ బయట నిలబడి ఉన్న బాలుడిని చూశారు. వాళ్ల చేతుల్లో ఉన్న కోక్ టిన్నులను ఆశగా చూడటంతో.. నీక్కూడా కావాలా అని అడిగారు. అతడు అవుననడంతో షహీనా లోపలికెళ్తూ, తనతో పాటు లోపలికి వస్తావా అని ఆ పిల్లాడిని అడిగారు. దానికి అతడు సంతోషంగా అంగీకరించి లోపల క్యూలోకి వెళ్లగానే మెక్ డోనాల్డ్స్ ఉద్యోగులు అతడిని మెడపట్టి బయటకు గెంటేశారు. ఇలాంటి వాళ్లను అసలు లోపలకు అనుమతించేది లేదని కూడా ఓ ఉద్యోగి చెప్పారు. పిల్లాడి పక్కన తాను ఉండగానే అతడి కాలర్ పట్టుకుని మరీ బయటకు లాగి పారేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తు జరిగినా తాము సహకరించేది లేదని మెక్ డోనాల్డ్స్ సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాము అంతర్గతంగా దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అసలు తమ రెస్టారెంట్లలో వివక్షకు తావు ఇవ్వబోమని కూడా చెప్పింది. -
న్యూజిలాండ్‌లో భారత సంతతి టీచర్‌పై దాడి
- మృత్యువుతో పోరాడుతున్న ఉపాధ్యాయుడు మెల్బోర్న్: న్యూజిలాండ్‌లో దాడికి గురైన ఓ భారత సంతతి ఉపాధ్యాయుడు(25) మృత్యువుతో పోరాడుతున్నాడు. ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందుతున్న తరుణ్ ఆస్థానా శనివారం సెంట్రల్ ఆక్లాండ్‌లోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా దాడి జరిగింది. పాదచారుల నడక దారిలో ఆస్థానా కొద్దిసేపు ఓ వ్యక్తితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తలపై బలంగా కొట్టటంతో ఆస్థానా కుప్పకూలినట్లు చెప్పారు. దాడికి ముందు నిందితుడు స్నేహితులతో కలిసి రెస్టారెంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్థానా వెంటిలేటర్‌పై ఉన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.