న్యూజిలాండ్‌లో భారత సంతతి టీచర్‌పై దాడి | Indian-origin teacher fighting for life after attack in New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌లో భారత సంతతి టీచర్‌పై దాడి

Published Sun, Nov 3 2013 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

Indian-origin teacher fighting for life after attack in New Zealand

- మృత్యువుతో పోరాడుతున్న ఉపాధ్యాయుడు
 
 మెల్‌బోర్న్: న్యూజిలాండ్‌లో దాడికి గురైన ఓ భారత సంతతి ఉపాధ్యాయుడు(25) మృత్యువుతో పోరాడుతున్నాడు. ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందుతున్న తరుణ్ ఆస్థానా శనివారం సెంట్రల్ ఆక్లాండ్‌లోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా దాడి జరిగింది.
 
 పాదచారుల నడక దారిలో ఆస్థానా కొద్దిసేపు ఓ వ్యక్తితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తలపై బలంగా కొట్టటంతో ఆస్థానా కుప్పకూలినట్లు చెప్పారు. దాడికి ముందు నిందితుడు స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్థానా వెంటిలేటర్‌పై ఉన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement