మాల్స్‌ను వీడి... వీధుల్లోకి రెస్టారెంట్లు | Big restaurants may walk out of malls to high streets | Sakshi
Sakshi News home page

మాల్స్‌ను వీడి... వీధుల్లోకి రెస్టారెంట్లు

Published Thu, May 28 2020 11:13 AM | Last Updated on Thu, May 28 2020 12:00 PM

Big restaurants may walk out of malls to high streets    - Sakshi

 కోవిడ్‌-19 కారణంతో మాల్స్‌లో ఉన్న రెస్టారెంట్లు వీధుల్లోకి రానున్నాయి. ఒకప్పుడు వీధుల్లో ఎంతో ఆహ్లాందంగా సాగే హోటల్‌ వ్యాపారాలన్నీ  పెద్దపెద్ద మాల్స్‌, అద్దాల భవనాల్లో ఎంతో ఆకర్షనీయంగానేగాక, ఖర్చుపరంగా సమాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగాయి. తాజాగా కోవిడ్‌ మహమ్మారీ విజృంభణతో వోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్న చందనా ..ఇప్పట్లో మాల్స్‌ తెరిచే పరిస్థితి లేకపోవడంతో పేరుమోసిన పెద్దపెద్ద రెస్టారెంట్లన్నీ వీధుల్లో తమ స్టాళ్లను తెరిచేందుకు ప్రయతిస్తున్నాయి.2000 సంవత్సంరం మొదట్లో వీధుల్లో ఉన్న రెస్టారెంట్లు మాల్స్‌లోకి వెళ్తే.. 2020లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా అవే రెస్టారెంట్లు వీధుల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ డైనింగ్‌ అండ్‌ క్యూఎస్‌ఆర్‌ చెయిన్‌​ మెక్‌డోనాల్డ్స్‌, స్పెషాలిటీ రెస్టారెంట్లు, డిగస్టీబస్‌, లైట్‌ బైట్‌ ఫుడ్స్‌ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 కోవిడ్‌ మహమ్మారి విస్తృతంగా వ్యాపించేందుకు మాల్స్‌ మంచి హాట్‌ స్పాట్‌ సెంటర్లు అయ్యే ప్రమాదం ఉన్నందున మాల్స్‌ను తెరవడం లేదు. ఒక వేళ మాల్స్‌ను ఓపెన్‌ చేసినప్పటికీ వ్యాపారాలు నిర్వహించడానికి సమయం పరంగా కొన్ని నిబంధనలు, నియంత్రణలు ఉన్నాయి. దీంతో రెస్టారెంట్లకు ఇంది పెద్ద ఇబ్బంది కలిగించే అంశమే. మరోపక్క  మాల్స్‌లో ఏర్పాటు చేసే ఫుడ్‌కోర్టులకు రెంట్‌ ఎక్కువగా ఉంటుంది. అదే వీధుల్లో అయితే తక్కువ ఖర్చుతో రెస్టారెంట్లను నడపవచ్చు. ఈ మూడు కారణాలతో మాల్స్‌లో ఉన్న బడా రెస్టారెంట్లన్ని వీధులు వంక చూస్తున్నాయి.

30-40 శాతంగా మాత్రమే..
కొన్ని ప్రాంతాల్లో ఎవరితో కలవకుండా సొంతంగా రెస్టారెంట్లు ఓపెన్‌ చేసేందుకు కొన్ని సంస్థలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అంతేగాకుండా ఫుడ్‌ను హోం డెలివరీ కూడా చేయనున్నాయి. ఉత్తర, తూర్పు భారతదేశ వ్యాప్తంగా మెక్‌ డోనాల్డ్స్‌కు 155 రెస్టారెంట్లు ఉన్నాయని కనౌట్‌ ప్లాజా రెస్టారెంట్స్‌ లిమిటెడ్‌(సీపీఆర్‌ఎల్‌) చైర్మన్‌ సంజీవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటికే మెక్‌డోనాల్డ్‌ తన 17 రెస్టారెంట్లను డ్రైవ్‌-త్రూస్‌ ప్రాంతాల్లో ప్రారంభించిందని, ఇంకా వీటికి సంబంధించిన మరికొన్ని పనులు పూర్తికావాల్సి ఉందన్నారు. ఒక వేళ మాల్స్‌ ఓపెన్‌ చేసినప్పటికీ రెస్టారెంట్‌ బిజినెస్‌ ప్రారంభంలో లాక్‌డౌన్‌కి ముందుతో పోలిస్తే 30-40 శాతంగా మాత్రమే సాగుతుందని  మెయిన్‌లాండ్‌, ఓ క్యాల్‌కటా రెస్టారెంట్లను నడిపే స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్‌జన్‌ చటర్జీ అన్నారు. అంతేగాకుండా మాల్స్‌లో రెస్టారెంట్ల వల్ల లాభాలతోపాటు నష్టాలుకూడా ఉన్నాయన్నారు. మాల్స్‌కు వచ్చే వారంతా తప్పకుండా అక్కడ ఉన్న రెస్టారెంట్లలో తినడానికి ప్రాధాన్యమిస్తారని తెలిపారు.

సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలి..
 మాల్‌ యజమానులకు వాణిజ్య సమస్యలను  పరిష్కరించుకోవాలని, అద్దెలు మాఫీ, రెవెన్యూ షేర్‌ మోడళ్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోని సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలని చెబుతూ ఈ మేరకు నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేష్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) ఒక లేఖ రాసింది. మరోపక్క  ఇప్పటికే అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో మా రెస్టారెంట్లను నడపడంలేదని, అద్దె ఖర్చులు తగ్గించుకునేందుకు త్వరలోనే మాల్స్‌ నుంచి మా రెస్టారెంట్లను తరలించనున్నామని గస్టీబస్‌ సీఈఓ ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్‌ అనురాగ్‌ కత్రియార్‌ వెల్లడించారు. పంజాబీ గ్రిల్‌, స్ట్రీట్‌ ఫుడ్స్‌, జమ్‌బార్‌లను నిర్వహించే లైట్‌ బైట్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ రోహిత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ..అద్దెలు కట్టలేక మాల్స్‌లో ఉన్న స్టోర్లను మూసివేసామని తెలిపారు. వీధుల్లో రెస్టారెంట్లు నిర్వహించడమే అన్ని విధాలుగా సులభమని కేఫ్‌ ఢిల్లీ హైట్స్‌ సహవ్యవస్థాపకులు శారద్‌ బాత్ర అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement