ఫ్రీ సోడా కోసం ఆడవాళ్ల మధ్య భీకర పోరు | Fight Over Free Soda At McDonald Restaurant In America | Sakshi
Sakshi News home page

ఫ్రీ సోడా కోసం ఆడవాళ్ల మధ్య భీకర పోరు

Published Fri, Jul 27 2018 11:58 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Fight Over Free Soda At McDonald Restaurant In America - Sakshi

రెస్టారెంట్‌లో గొడవ పడుతున్న మహిళలు(వీడియో దృశ్యాలు)

న్యూయార్క్‌ : సోడా కోసం ఇద్దరు ఆడవాళ్ల మధ్య మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానై భీకర పోరుకు దారి తీసింది. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా ఉన్న గొడవ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌కు ఓ యువతి వెళ్లింది. ఫ్రీ సోడా తాగటానికి ఓ వాటర్‌ గ్లాస్‌ ఇవ్వాల్సిందిగా యువతి అక్కడున్న రెస్టారెంట్‌ ఉద్యోగినిని అడిగింది. అయితే ఆ ఉద్యోగిని అందుకు ఒప్పుకోలేదు. ఏమైనా కొనుగోలు చేస్తే గ్లాసు ఇస్తానని ఆ యువతికి చెప్పింది. అయితే ఫ్రీ సోడా ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన ఆ యువతి ఆమెను దుర్భాషలాడింది. అక్కడనున్న చిప్స్‌ను ఆమెపై విసురుతూ ఎగతాళి చేస్తూ మాట్లాడింది.

యువతి మాటలకు కోపం తెచ్చుకున్న ఆ ఉద్యోగిని ఆమెపైకి ఉరికింది. యువతిని బల్లపైకి తోసి మొహంపై పిడిగుద్దులు గుద్దింది. డబ్ల్యూడబ్ల్యూఈకి  ఏమాత్రం తీసిపోని విధంగా కొద్దిసేపు ఇద్దరి మధ్య భీకర పోరు నడిచింది. ఇంతలో యువతిని పక్కకు లాగుతున్న ఓ మహిళపై కూడా ఆ యువతి తిరగబడటంతో ఆమె కూడా రెండు దెబ్బలు వేసింది. అయినా ఆ యువతి ఏమాత్రం తగ్గలేదు సరికదా కుర్చీ తీసుకుని ఉద్యోగినిపై దాడికి వెళ్లింది. అయితే ఆ ఉద్యోగిని కుర్చీ లాక్కొని గొడవను సద్దుమనిగేలా చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement