ఢిల్లీ:సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం | Delhi Govt Plans To Reopen Govt Schools And Colleges On September 1st Onwards | Sakshi
Sakshi News home page

ఢిల్లీ:సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం

Published Mon, Aug 30 2021 5:53 PM | Last Updated on Mon, Aug 30 2021 6:12 PM

Delhi Govt Plans To Reopen Govt Schools And Colleges On September 1st Onwards - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రలో దశలవారీగా  సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 9-12వ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్‌ 1 నుంచి ఆఫ్‌లైన్‌లో పాఠశాలలు, కళాశాలు ప్రారంభం కాగా, 6-8వ తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత ప్రారంభం కానున్నాయి.

చదవండి: Work From Home: షుగర్‌, బీపీ, ఒబెసిటి కంటే.. ఈ సమస్యే ఎక్కువ! తగ్గాలంటే ఈ టిప్స్‌ పాటించండి

అదే విధంగా విద్యాసంస్థల వద్ద క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో విద్యాసంస్థలు పున: ప్రారంభిస్తామని పేర్కొంది. అన్ని పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు, రేషన్‌ బియ్యం పంపిణీ కొనసాగుతుందని పేర్కొంది. సెప్టెంబర్‌1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.

చదవండి: Maharashtra: 10 రోజుల్లో ఆలయాలు తెరవండి.. లేదంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement