భోపాల్: కరోనా మహమ్మారి కారాణంగా దేశవవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అత్యవసర సర్వీసులు తప్ప అన్ని కార్యాలయాలు మూతబడ్డాయి. అయితే ఐదు వారాల మూతబడ్డ కార్యలయాలు మధ్యప్రదేశ్‌లో గురువారం తెరచుకున్నాయి. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సింగ్ చౌహాన్ మాట్లాడుతూ... ప్రజల సహకారంతో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతున్నాయి. ఇప్పటి వరకు అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేస్తుండగా ఇక నుంచి రాష్ట్ర స్థాయి ఆఫీసులు, సెక్రటేరీయట్, డైరెక్టరేట్‌లతో సహా అన్ని కార్యాలయాలు పనిచేస్తాయి. వీటిలో 30 శాతం స్టాఫ్‌తో విధులు నిర్వర్తిస్తారు. ఇలా చేస్తే పునరాభివృధ్ది సాధించవచ్చు. సామాజిక దూరం నిబంధనలు కచ్ఛితంగా పాటించాలి అని ఆయన పేర్కొన్నారు. (నేను చనిపోలేదు..బతికే ఉన్నా : కరోనా పేషెంట్)
అయితే దీనిపై కొంత మంది ఉద్యోగులు స్పందిస్తూ ఇన్ని రోజుల తరువాత ఆఫీసుకు రావడం సంతోషంగా ఉన్నా రాష్ట్రంలో కరోనా విజృంభణ విస్తృతంగా ఉండటంతో భయంగా ఉందన్నారు. ఇంట్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్లు ఉండటంతో వారికి ఏం అవుతుందో అన్న కంగారు వారిని వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఆఫీసు అంతా శానిటైజర్లో శుభ్రం చేసి తరువాతే విధుల నిర్వహిస్తామని చెబుతుండగా, మరికొందరు తమ టెబుల్, ఫైల్స్ అన్ని శుభ్రం చేశారో లేదో పరిశీలించిన తరువాతే జాగ్రత్తలు తీసుకుంటు పనిచేస్తున్నామని తెలిపారు. అయితే వారికి రోజు మార్చి రోజు విధులుకు రావాలో లేక రోజు రావాలో అనే విషయం ఇంకా తెలియజేయలేదని అక్కడ పనిచేస్తున్న వారు తెలిపారు. ఈ విధంగా ఆఫీసులు మొదలవడంతో ఒక్కొక్కరు ఒక్కో భయంతో కార్యాలయాలకు వస్తున్నారు. (కరోనా విపత్తులో ఉగ్రదాడికి కుట్ర )
అక్కడ తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు
Published Thu, Apr 30 2020 2:45 PM | Last Updated on Thu, Apr 30 2020 2:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment