
ఫైల్ ఫోటో
సాక్షి, ప్రకాశం: రేపటి నుంచి రాష్ట్రంలో బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు. తగ్గించిన సిలబస్‌తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ఇళ్లకు పంపిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.