![Racer K E Kumar Dies Following Crash At National Championship - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/9/Untitled-3.jpg.webp?itok=DuEWq1e9)
చెన్నై: ఎంఆర్‌ఎఫ్–ఎఫ్‌ఎమ్‌ఎస్ సీఐ జాతీయ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన రెండో రౌండ్ రేసింగ్‌లో సీనియర్ రేసర్ కె.ఇ.కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో పోటీపడిన 59 ఏళ్ల సీనియర్ రేసర్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై భారత మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment