racing championship
-
సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
-
నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!!
‘రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్’ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ స్థాయి గోకార్ట్ రేసింగ్. 7 నుంచి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు అనేక దేశాల నుంచిపాల్గొంటారు. 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ‘మైక్రో మ్యాక్స్’ రేస్‌లో ఈసారి విజేతగా నిలిచింది మన కశ్మీర్ చిన్నారి అతికా మీర్. దాదాపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గోకార్ట్ నడుపుతూ డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శిస్తూ ఈ విజయం సాధించింది. మోటర్‌స్పోర్ట్స్ చరిత్రలో గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేస్ గెలిచిన ఫస్ట్–ఫిమేల్ రేసర్‌గా చరిత్ర సృష్టించింది అతికా మీర్..ప్రతిష్ఠాత్మకమైన రోటాక్స్ మాక్స్ ఛాలెంజ్(ఆర్ఎంసీ) ఇంటర్నేషనల్ ట్రోపీలో మైక్రో మాక్స్ కేటగిరీ రేస్ 2లో అతికా మీర్ విజయం సాధించింది. గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఫ్రాన్స్)లోపాల్గొనడం మీర్‌కు ఇదే తొలిసారి. ముందస్తు ప్రాక్టీస్ లేక΄ోయినప్పటికీ కొత్త బ్రాండ్ కార్ట్‌ను వేగంగా ఎడాప్ట్ చేసుకొని తన ప్రతిభ చాటుకుంది. రోటాక్స్ మాక్స్ చాలెంజ్ ప్రతిష్ఠాత్మకమైన రేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కార్ట్ డ్రైవర్స్‌కు వేదిక. రేస్ 2లో అతికా విజయాన్ని ‘స్పీడ్ అండ్ స్ట్రాటజీ’కి సంబంధించి మాస్టర్‌క్లాస్ అంటున్నారు విశ్లేషకులు.‘రేస్ విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూరప్‌లో ఇది నా తొలి విజయం. ఈ విజయం కోసం చాలా శ్రమ పడ్డాను. నా టీమ్ ఎంతో సహకారాన్ని అందించింది. నా తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం నాకెంతో బలం’ అంటుంది అతికా మీర్. దుబాయ్‌లోని మాల్స్‌లో మీర్ సరదాగా ఎలక్ట్రిక్ కార్లు నడిపేది. మీర్ డ్రైవింగ్ స్కిల్స్‌ను చూసి తండ్రితో సహా మాల్లో ఉన్న వాళ్లు ముక్కున వేలేసుకునేవారు. మీర్ తండ్రి ఆసిఫ్ నజీర్ మీర్ మన దేశ తొలి నేషనల్ కార్టింగ్ ఛాంపియన్. డ్రైవింగ్‌కు సంబంధించి తండ్రి ఇచ్చిన రకరకాల టైమ్ చాలెంజ్‌లను బీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది మీర్.‘ఇక టైమ్ వృథా చేయవద్దు. మీర్‌ను కార్టింగ్ ప్రపంచంలోకి తీసుకురా వాల్సిందే’ అనుకున్నాడు ఆసిఫ్ నజీర్. ఇక ఆరోజు నుంచి మీర్‌లో కార్టింగ్పై మొదలైన ఇష్టం అంతకంతకూ పెరుగుతూ ΄ోయింది. ఫిట్నెస్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్ములా వన్‌లో విజయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించాలని కల కనేలా చేసింది.ఆరు సంవత్సరాల వయసులో ఎఫ్ఐఏ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ అండ్ యంగెస్ట్ ఫిమేల్ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించింది. మీర్ తొలి ఫుల్ సీజన్ రేసింగ్ యూఏయిలో జరిగిన మినీ ఆర్ కేటగిరితో మొదలైంది. ఈ రేస్‌లో వైస్–చాంపియన్ టైటిల్ గెలుచుకుంది.వచ్చే ఆగస్ట్‌లో మీర్ యూకేలోని వరల్డ్–ఫేమస్ ‘కార్ట్మాస్టర్స్’లో డ్రైవింగ్ చేయనుంది. ఇటలీలోని ఐరన్ డేమ్స్ యంగ్ టాలెంట్ ఈవెంట్‌కు కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ΄ోటీకి ఎంపికైన 11 మంది బాలికలలో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మీర్. ‘రేస్‌కు ముందు నెర్వస్‌గా ఉంటాను. కారులో కూర్చున్న తరువాత మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలాగైనా ఈ రేస్‌లో గెలవాల్సిందే అనే పట్టుదల పెరుగుతుంది. భయాలు కొట్టుకు΄ోతాయి’ అంటుంది మెరిసే కళ్లతో అతికా మీర్. ఈ చిన్నారి భవిష్యత్‌లో ఎన్నెన్ని మెరుపులు మెరిపించనుందో వేచిచూద్దాం! -
హైదరాబాద్ నుంచి రేసింగ్ పోటీలు తరలింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా నగరంలో జరగాల్సిన రెండు రేసింగ్ పోటీలు రద్దయ్యాయి. ఈ నెల 4, 5 తేదీల్లో నెక్లెస్ రోడ్ వేదికగా ఎఫ్4 ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ నిబంధనలతో వీటిని ఇక్కడ జరపడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండు రేస్‌లను హైదరాబాద్‌నుంచి తరలిస్తున్నామని, ప్రకటించిన ఆ రెండు తేదీల్లోనే చెన్నైలో నిర్వహిస్తామని వారు వెల్లడించారు. రేస్‌ల కోసం ఇప్పటికే టికెట్లు కొన్నవారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. -
Hyderabad E-Prix 2023 : రేసింగ్ @ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కౌంట్‌డౌన్ పూర్తయింది... ఇక హైదరాబాద్ స్ట్రీట్‌పై జనరేషన్–3 కార్లు జోరుగా దూసుకుపోవడమే మిగిలింది. భాగ్యనగర రేసింగ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫార్ములా ‘ఇ’ సమరానికి సమయం వచ్చేసింది. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేకంగా సిద్ధమైన స్ట్రీట్ సర్క్యూట్లో కార్లు జూమ్మంటూ దూసుకుపోతుంటే ఆ వినోదాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు ఈ ‘ఇ’ ప్రి పోరులో సత్తా చాటబోతున్నారు. శుక్రవారమే తొలి ఫ్రీ ప్రాక్టీస్ పూర్తి కాగా, డ్రైవర్లు శనివారం ఉదయం రెండో ఫ్రీ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత క్వాలిఫయింగ్ ఈవెంట్ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేస్ జరుగుతుంది. ఆధిక్యంలో ఆండ్రెటీ... ఫార్ములా ‘ఇ’లో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్‌లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్‌కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో జరగబోతోంది ఈ సీజన్లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్‌ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది. మహీంద్రా సాధించేనా... ఫార్ములా ‘ఇ’ ప్రారంభమైన 2014 సీజన్ నుంచి భారత్‌కు చెందిన మహీంద్రా రేసింగ్ టీమ్ బరిలో ఉంది. ఓవరాల్‌గా ఇన్నేళ్లలో 5 రేస్‌లు గెలిచిన ఆ జట్టు డ్రైవర్లు 24 సార్లు పోడియం (టాప్–3)పై నిలబడటంలో సఫలమయ్యారు. 2016–17 సీజన్లో టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా మూడో స్థానంలో నిలిచిన టీమ్... తొలిసారి స్వదేశంలో పోటీకి సిద్ధమైంది. మహీంద్ర టీమ్‌లో బ్రిటన్‌కు చెందిన ఒలివర్ రోలండ్, బ్రెజిల్‌కు చెందిన ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా వ్యవహరిస్తుండగా... భారత యువ రేసర్ జెహాన్ దారువాలా రిజర్వ్ డ్రైవర్‌గా ఉన్నాడు. గత సీజన్లో టీమ్ ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. తాజా సీజన్లో మెక్సికో సిటీలో జరిగిన తొలి రేస్‌లో గ్రాసీ మూడో స్థానం సాధించడంతో 18 పాయింట్లు టీమ్ ఖాతాలో చేరాయి. దాంతో పట్టికలో మహీంద్రా ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరం. షాంపేన్ కాదు..రంగు కాగితాలే... రేసింగ్ సర్క్యూట్లో ఫలితం వచ్చిన తర్వాత విజేతలు షాంపేన్ బాటిల్‌తో సంబరాలు చేసుకోవడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వేదికల్లోనూ ఇది కనిపిస్తుంది. అయితే స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ ఆయా దేశాల్లో షాంపేన్‌ను దూరంగా ఉంచాలని ఇటీవల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాలో తొలిసారి తాజా సీజన్లో ఎఫ్–1 జరిగినప్పుడు, గత ఏడాది ఇండోనేసియా ఫార్ములా ‘ఇ’ జరిగినప్పుడు కూడా రంగు రంగుల కాగితాలు వెదజల్లడంతోనే వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనినే హైదరాబాద్‌లోనూ అనుసరించబోతున్నారు. ఇక్కడా షాంపేన్‌తో సంబరాలు లేకుండా మెషీన్ల ద్వారా రంగురంగుల కాగితాలను వెదజల్లుతారు. ప్రాక్టీస్‌లో ప్రమాదం... శుక్రవారం తొలి ఫ్రీ ప్రాక్టీస్ సందర్భంగా సర్క్యూట్‌పై అనుకోని ఘటన చోటు చేసుకుంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ‘పోర్‡్ష’ జట్టు డ్రైవర్ పాస్కల్ వెర్లీన్ కారు అదుపు తప్పింది. 18వ మలుపు వద్ద ఎడమవైపు గోడను ఢీకొని కారు నిలిచిపోయింది. అయితే అదృష్టవశాత్తూ పాస్కల్ ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం పాయింట్లలో అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ట్రాక్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, స్ట్రీట్ సర్క్యూట్ ఇలా కాస్త ఎక్కువ దుమ్ముతో ఉండటం సహజమేనని నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు ట్రాక్‌పైకి అనూహ్యంగా పబ్లిక్ వాహనాలు దూసుకురావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ట్రాఫిక్‌ను నిలువరిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని దాటి ఒక బైకర్ ముందుకు వెళ్లడం, మిగతా వారంతా అతడిని అనుసరించినట్లుగా తెలిసింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహక బృందం పరిస్థితిని చక్కదిద్దింది. దాంతో ప్రాక్టీస్ రేస్ అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది. -
తీవ్ర విషాదం.. కార్ రేసింగ్ పోటీల్లో ప్రముఖ రేసర్ దుర్మరణం
చెన్నై: ఎంఆర్ఎఫ్–ఎఫ్ఎమ్ఎస్ సీఐ జాతీయ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన రెండో రౌండ్ రేసింగ్‌లో సీనియర్ రేసర్ కె.ఇ.కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో పోటీపడిన 59 ఏళ్ల సీనియర్ రేసర్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై భారత మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎమ్ఎస్సీఐ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. -
ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున శనివారం ప్రారంభం కాగా.. ఆ ఎఫెక్ట్ మాత్రం నగరంలోని పలు రోడ్లపైన పడింది. శనివారం ట్రయల్ రన్, క్వాలిఫైయింగ్ రేస్‌ల తరువాత మెయిన్ రేసింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు సాగింది. రేసింగ్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ గుండా వేసిన 2.8 కిలోమీటర్ల ప్రత్యేక సర్క్యూట్లో ఈ రేస్ సాగింది. కాగా, మూడు రోజులుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శనివారం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్లన్నీ మూసివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రోడ్డును మూసివేశారు. మింట్ కంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లే రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ పై నుంచి పంపిస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా ముందుకు సాగింది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు.. బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మి నార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. నగరం నడిబొడ్డున ట్రాఫిక్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్లించిన కారణంగా ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు దారితీసింది. మెహిదీపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే పైన కూడా వాహనాలు నిలిచిపోయేంత ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ మీదుగా లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, అసెంబ్లీ నుంచి ఆబిడ్స్ వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా సాగింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పరిస్థితి. శనివారం వర్కింగ్ డే కావడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని నగర పోలీస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం ట్రాఫిక్ సమస్య అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ పేర్కొంది. -
సాగర తీరంలో రయ్ రయ్.. పరుగులు తీసిన రేసింగ్ కార్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం నెక్లెస్ రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీశాయి. 60 నుంచి 80 సెకన్ల వ్యవధిలో ఒక ల్యాప్ చొప్పున పూర్తి చేశాయి. సాయంత్రం 4.18 గంటలకు మంత్రి కేటీఆర్ ట్రాక్‌ను సందర్శించి జెండా ఊపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దాంతో రేసింగ్ కార్లు ముందుకు దూకాయి. వాయువేగంతో దూసుకెళ్లాయి. గంట పాటు పోటీలు జరిగాయి. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పోటీల కోసం 2.3 కిలోమీటర్ల ట్రాక్నే వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌లో 17 మలుపుల నుంచి 200 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీశాయి. ఈ పోటీలను వీక్షించేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. పిల్లలు, పెద్దలతో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడిగా కనిపించింది. మరోవైపు పోటీల నిర్వహణ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లు, భద్రతా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ పోటీలను తిలకించేందుకు కేటీఆర్ తనయుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి వచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఆరు బృందాలు.. 12 కార్లు.. పోటీల్లో ఆరు బృందాలు పాల్గొన్నాయి. 12 రేసింగ్ కార్లను వినియోగించారు. హైదరాబాద్ బర్డ్స్ టీమ్‌లో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు అనిందిత్‌రెడ్డి, అఖిల్ రవీంద్ర, స్వీడన్ రేసర్ నీల్జానీ, ఫ్రెంచ్ రేసర్ లోలా లోవిన్సాస్లు ఉన్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం తొలిరోజు క్వాలిఫయింగ్తో పాటు ఒక ప్రధాన రేస్ జరగాల్సి ఉన్నా.. కొత్త ట్రాక్ కావడంతో రేసర్లు ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. ఆదివారం అన్ని రేసులూ జరగనున్నాయి. కుంగిన గ్యాలరీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ కొద్దిగా కిందకు కుంగింది. మంత్రి కేటీఆర్ రావడంతో ఆయనతో పాటు చాలా మంది పైకి వచ్చారు. దీంతో గ్యాలరీ సామర్థ్యం కంటే ఎక్కువ మంది చేరడంతో ఒక వైపు బరువు పెరిగి గ్యాలరీ కుంగింది. అప్రమత్తమైన పోలీసులు కొంతమందిని కిందకు దింపారు. విరిగిపడిన చెట్టు కొమ్మ మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గ్యాలరీలు వెలవెల వేలాది మంది ప్రేక్షకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం తక్కువగానే కనిపించింది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి. చాలా మంది నెక్లెస్‌రోడ్డు, మింట్‌కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో ట్రాక్ బయట నించొని పోటీలను వీక్షించారు. హైదరాబాద్ మంచి వేదిక ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర చోట్ల కార్ రేసింగ్ జరిగింది. మన హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ రేసింగ్ శిక్షణకు, పోటీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో పాటు మలేసియా, జపాన్, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. హైదరాబాద్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. స్ట్రీట్ సర్క్యూట్ కూడా చాలా బాగుంది. అంతా తిరిగి చూశాం. ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. – అనిందిత్‌రెడ్డి, హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్‌కు ఉత్తమ భవిష్యత్ మోటార్ స్పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న క్రీడ. ఈ క్రీడలో పాల్గొనే రేసర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. మన ఇండియాలో కూడా రేసింగ్‌లో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో ఈ శిక్షణ ఉంది. హైదరాబాద్ యూత్‌కు ఈ రంగంలో గొప్ప అవకాశాలున్నాయి. – అఖిల్ రవీంద్ర, బెంగళూరు ఇండియాలో ఇదే తొలిసారి పారిస్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ఇండియాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా ఉత్సాహంగా ఉంది. 2016 నుంచి రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ పోటీలు నాకు చాలా ఇష్టం. – లోలా లోవిన్సాస్, ఫ్రాన్స్ ఇంగ్లిష్ చానళ్లలో మాత్రమే చూసేవాళ్లం కార్ రేసింగ్ అంటే ఇన్నాళ్లు టీవీలో.. అదికూడా ఇంగ్లిష్ న్యూస్ చానళ్లల్లో మాత్రమే చూసేవాళ్లం. అలాంటిది ఈ రేసింగ్ ఈవెంట్‌ను సిటీలో నిర్వహించడం మంచి అనుభూతినిచ్చింది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో సిటీ ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా వన్ వంటి గేమ్స్‌కు నగరం ఆతిథ్యమివ్వడంతో సిటీ గొప్పదనం మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇకపై నగరవాసులు కూడా ఇలాంటి గేమ్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. – సంతోష్, మోడలింగ్ ఔత్సాహికుడు నగరానికి నయా కళ ఇలాంటి కార్ రేసింగ్ ఒక్కసారైనా చూస్తానా అని అనుకునేదానిని. సిటీలో స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి వేచి చూశాను. ఇలాంటి ఇండియన్ రేసింగ్ ఈవెంట్స్ మరెన్నో నగరంలో జరగాలని కోరుకుంటున్నాను. మన రోడ్లపై రేసింగ్ కార్లు దూసుకుపోతుంటే ఏదో కొత్త కళ వచ్చింది. దేశ్యవాప్తంగా పాల్గొన్న రేసర్లను దగ్గరగా చూడటం మంచి అనుభూతి. – ఐశ్వర్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
వాహనదారులకు అలర్ట్.. ఎన్టీఆర్ మార్గ్ మూసివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం ఉత్కంఠభరితమైన రేసింగ్ లీగ్‌కు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరుగనున్నాయి. దీంతో, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో శుక్రవారం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌ను పూర్తిగా మూసివేయనున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. కాగా, రేసింగ్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ట్రాక్ పనులు చేసేందుకు శుక్రవారం నుంచే పనులు ప్రారంభమయ్యాయి. ట్రాక్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రోడ్డును మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఎన్టీఆర్ మార్గ్ కాకుండా వేరే మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. -
రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం ఉత్కంఠభరితమైన పోటీలకు సిద్ధమైంది. ఆహ్లాదభరితమైన సాగరతీరంలో కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయే ఇండియన్ రేసింగ్ లీగ్ కార్ల పోటీలు మరి కొద్ది గంటల్లో కనువిందు చేయనున్నాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటిష్టమైన ట్రాక్‌ను సిద్ధం చేశారు. పోటీల్లో పాల్గొననున్న కార్లు నగరానికి చేరుకున్నాయి. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా బుక్ మై షో ద్వారా పాస్‌ల అమ్మకాలను చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న ఫార్ములా–ఈ ఎలక్ట్రిక్ కార్ల పోటీలను దృష్టిలో ఉంచుకొని ట్రయల్ రన్‌గా ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ పోటీలకు సన్నద్ధమైంది. ఈ నెల 19, 20 తేదీలతో పాటు, డిసెంబర్ 10, 11 తేదీల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. శని, ఆదివారం నాటి పోటీల్లో పాల్గొనేందుకు 12 రేసింగ్ కార్లు నగరానికి చేరుకున్నాయి. అత్యంత పటిష్టంగా స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ శని, ఆదివారాలు రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో 17 చోట్ల మలుపులతో కూడిన 2.8 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్‌పైన కార్లు పరుగులు తీయనున్నాయి. గంటకు సుమారు 250 కిలోమీటర్ల వేగంతో కార్లు పరుగులు తీసేవిధంగా స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్‌ను అత్యంత పటిష్టంగా రూపొందించారు. శనివారం ఈ పోటీలు ప్రారంభం కానున్న దృష్ట్యా నిపుణులు గురువారం మరోసారి ట్రాక్‌ను పరిశీలించారు. ఇతరులు నెక్లెస్‌రోడ్డులోకి ప్రవేశించకుండా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. నెక్లెస్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లించారు. ఏమిటీ రేసు... 2019లో తొలిసారి ఎక్స్1 రేసింగ్ లీగ్ పేరుతో పోటీలు జరిగాయి. దీనిని స్వల్ప మార్పులతో ఇప్పుడు ఇండియన్ రేసింగ్ లీగ్‌గా మార్చారు. ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (ఎఫ్ఐఏ) గుర్తింపు పొందిన ఫార్ములా రీజినల్ ఇండియన్ చాంపియన్‌షిప్, ఎఫ్4 ఇండియన్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇది జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు ఈవెంట్లు వాయిదా పడగా, ఇండియన్ రేసింగ్ లీగ్‌ను మాత్రం నవంబర్ – డిసెంబర్లలో హైదరాబాద్, చెన్నై వేదికలుగా నిర్వహిస్తున్నారు. కారు ఎలా ఉంటుంది... సింగిల్ డ్రైవర్ ఎఫ్3 డిజైన్ కార్లు ఉంటాయి. ఇటలీకి చెందిన ‘వుల్ఫ్’ కంపెనీ వీటిని తయారు చేసింది. పురుషులు, మహిళల మధ్య రేసింగ్‌లో తేడా రాకుండా ఎఫ్3 డిజైన్ కారు నిర్మాణం ఉంటుంది. రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్) ఈ పోటీలను నిర్వహిస్తోంది. భారత్‌లో భవిష్యత్తుల్లో కార్ రేసింగ్ స్థాయి పెంచేందుకు ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని ఆర్పీపీఎల్ చైర్మన్ అఖిలేశ్ రెడ్డి వెల్లడించారు. ఎన్ని రేస్‌లు... ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా మొత్తం నాలుగు రేస్‌లు జరుగుతాయి. తొలి, చివరి రేస్‌లకు హైదరాబాద్ వేదిక కాగా, మధ్యలో రెండు రేస్‌లు చెన్నైలో జరుగుతాయి. నాలుగు రేస్‌లలో వచ్చిన ఫలితాలను బట్టి తుది విజేతను నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో డిసెంబర్ 10–11 తేదీల్లో చివరి రేస్ నిర్వహిస్తారు. బరిలో 22 కార్లు.. గరిష్ట వేగం 250 కి.మీ హైదరాబాద్ అంచెలో భాగంగా శని, ఆదివారాల్లో రేస్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటనుంచి 5 గంటల వరకు రేస్ జరుగుతుంది. తొలి రోజు రెండు క్వాలిఫయింగ్ రేసులతో పాటు ఒక ప్రధాన రేసు జరుగుతుంది. ఆదివారం మరో రెండు ప్రధాన రేస్‌లు జరుగుతాయి. గరిష్టంగా 40 నిమిషాల పాటు రేస్ ఉంటుంది. మొత్తం 22 కార్లు బరిలో ఉంటాయి. కార్ల గరిష్ట వేగం 250 కిలో మీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 17 మలుపులతో రేస్ ఆసక్తికరంగా సాగనుంది. ఎలా చూడవచ్చు... స్టార్ స్పోర్ట్స్‌లో పోటీల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది...అయితే నేరుగా చూడాలనుకునేవారి కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక రోజుకైతే రూ.749, రెండు రోజులకైతే రూ. 1,249 చొప్పున టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. జట్ల వివరాలు... హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, గోవా ఏసెస్, చెన్నై టర్బో రైడర్స్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, స్పీడ్ డెమాన్స్ ఢిల్లీ పేరుతో 5 టీమ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ టీమ్‌లో రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్న అనిందిత్ రెడ్డి ప్రధాన ఆకర్షణ. మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడే అనిందిత్. నీల్ జానీ, ఒలివర్ జేమ్స్, రౌల్ హైమెన్వంటి గుర్తింపు ఉన్న రేసర్లతో పాటు మహిళల విభాగంలో ప్రముఖ రేస ర్ నికోల్ హవ్దా చెన్నై తరఫున బరిలోకి దిగుతోంది. భవిష్యత్తు... పూర్తి స్థాయి సర్క్యూట్ లేనందున ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఉన్నది ‘స్ట్రీట్ సర్క్యూట్’ మాత్రమే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నగరంలో ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్ జరగనుంది. ఇండియన్ రేసింగ్ లీగ్‌తో పోలిస్తే దానిస్థాయి చాలా పెద్దది. ఆ రేసు కూడా ఇదే ట్రాక్‌పై జరగనుంది కాబట్టి దానికి ముందు సన్నాహకంగా ఈ రేసింగ్ లీగ్‌ను చూడవచ్చు. ట్రాక్ ఎలా ఉంటుంది... లీగ్‌లో చెన్నైలో జరిగే పోటీలను అసలైన ‘రేసింగ్ సర్క్యూట్’లోనే జరుగుతుంది. హైదరాబాద్‌లో మాత్రం ఇది భిన్నం. దీనిని ‘స్ట్రీట్ సర్క్యూట్’గా వ్యవహరిస్తున్నారు. అంటే రేస్ ముగిసిన తర్వాత మళ్లీ అదే ట్రాక్ సాధారణ రోడ్డుగా వాడకంలోకి వస్తుంది. కొత్త రేస్ కోసం మళ్లీ అవసరమైతే ట్రాక్‌ను సిద్ధం చేస్తారు. ఎన్టీఆర్ మార్గ్‌ను విస్తరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌ను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో స్ట్రీట్ రేసింగ్ జరగడం కూడా ఇదే మొదటిసారి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: FIFA WC 2022: ఆరో టైటిల్ వేటలో బ్రెజిల్ -
భారత్‌లో అడుగుపెట్టనున్న మోటో జీపీ.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?
ఫార్ములా రేసింగ్‌ను ఇష్టపడే భారత అభిమానులకు శుభవార్త. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే మోటో జీపీ బైక్ రేసింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ తొలిసారి ఇండియాకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను ''గ్రాండ్ పిక్స్ ఆఫ్ భారత్'' పేరుతో మన దేశంలో నిర్వహించనున్నారు. అందుకోసం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. మోటార్‌సైకిల్ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవల్ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది. మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకముందు భారత్‌లో తొలిసారి జరిగిన ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్‌తోనే ఎఫ్1 ఇండియన్ గ్రాండ్ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది. చదవండి: తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ -
లండన్, న్యూయార్క్, బెర్లిన్.. ఇప్పుడు మన హైదరాబాద్
హ్యాపెనింగ్ సిటీగా రెండు దశాబ్ధాలుగా దూసుకుపోతోంది హైదరాబాద్ నగరం. తాజాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే మరో గొప్ప ఈవెంట్‌కి వేదికగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఫార్ములా వన్ తరహాలో ఇటీవల ఫేమస్ అయిన ఇ-వన్ ఛాంపియ్షిప్ని హోస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఫార్ములా వన్ రేసింగ్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. కార్పోరేట్ వరల్డ్‌లో ఈ పోటీలకు గుర్తంపు వేరే లెవల్లో ఉంటుంది. ఒలంపిక్స్ తరహాలో ఆయా దేశాలను తమ నగరాలకు ప్రమోట్ చేసుకునేందుకు ఫార్ముల వన్ రేసింగ్స్ నిర్వహిస్తుంటాయి. కాగా ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫార్ములా ఛాంపియన్షిప్ తెర మీదకు వచ్చింది. పదో సీజన్‌కి ఇ వన్ ఫార్ములా ఛాంపియన్షిప్ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్, వాంకోవర్ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రయ్..రయ్.. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం... ఫార్ముల వన్ రేసింగ్ నిర్వహించాలంటే ప్రత్యేకంగా ట్రాక్ అవసరం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో నిర్వహించే పోటీలకు ప్రత్యేక రేసింగ్ ట్రాక్ అక్కర్లేదు. నగరంలో అందుబాటులో ఉన్న రోడ్లపై రేస్ నిర్వహించవచ్చు. ఇప్పటి వరకు ఇ రేసింగ్ ఛాపింయన్షిప్కి నెక్లస్‌రోడ్డు - ట్యాంక్‌బండ్ సర్క్యూట్, కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న సర్క్యూట్ రోడ్డు, గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కీలక చర్చలు ఇ వన్ ఫార్ములా పోటీలు నిర్వహించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపించారు... పలు దఫా చర్చల అనంతరం హైదరాబాద్ తెర మీదకు వచ్చింది. ఈ మేరకు ఫార్ములా ఇ అసోసియేషన్, తెలంగాణ, గ్రీన్కో సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఖరరానైట్టు అధికారి వర్గాలు వెల్లడించాయంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. తుది చర్చలు 2022 జనవరి 17న జరుగునున్నాయి. #HappeningHyderabad#ChangeAccelerated Govt of Telangana along with Greenko Group invites you to join us in welcoming @FIAFormulaE to Hyderabad pic.twitter.com/z4OzOydEJ7 — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 16, 2022 వెనక్కినెట్టి ఇ ఫార్ములా ఛాంపియన్షిప్ రేస్‌కి ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాలు సైతం పోటీ పడ్డాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం చూపిన చొరవ, స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చివరకు హైదరాబాద్ మిగిలిన నగరాలను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది. బ్రాండ్ హైదరాబాద్ రేసింగ్ పోటీలకు కార్పోరేట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్లే విజయ్‌మాల్యా, ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తలు సొంతంగా ఫార్ములా వన్ టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పోటీలకు కనుక ఆతిధ్యం ఇస్తే హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలో మరింతగా వెలిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. చదవండి: ఇలా చేస్తే కుదరదబ్బా ! ఝలక్ ఇచ్చిన కస్టమర్లు..ఇరకాటంలో ఓలా! -
‘బ్లాక్‌బర్డ్స్’ హంగామా
-
చాంపియన్ అనిందిత్
సాక్షి, హైదరాబాద్: యూరో జేకే–17 ఫార్ములా రేసింగ్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు. వరుసగా రెండోసారి విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ఈ రేసును అనిందిత్ 2ని.4.792 సెకన్లలో పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచాడు. నయన్ సి చటర్జీ, విష్ణు ప్రసాద్ వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. ఇప్పటివరకు అనిందిత్ పోలో వెంట్ చాంపియన్‌షిప్‌ను ఒకసారి... ఎంఆర్ఎఫ్–బీఎండబ్ల్యూ చాంపియన్‌షిప్, జేకే టైర్స్ చాంపియన్‌షిప్‌లను రెండుసార్లు చొప్పున గెలుచుకున్నాడు. -
మూడో స్థానంలో అనిందిత్
సాక్షి, హైదరాబాద్: జేకే టైర్ ఎఫ్ఎంఎస్సీఐ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ రేసర్ అనిందిత్ రెడ్డి మెరిశాడు. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ ఈవెంట్ రెండో రౌండ్లో ఒక రేసులో విజేతగా నిలిచి ఓవరాల్‌గా యూరో జేకే–17 విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. రేస్–2లో నాలుగో స్థానం నుంచి ప్రారంభించిన అనందిత్ విజేతగా నిలిచాడు. తొలి రేసులో రికీ కాపో గెలిచాడు. ఓవరాల్‌గా జేకే–17 విభాగంలో తొలిరోజు ముగిసేసరికి నయన్ చటర్జీ , రికీ కాపో, అనందిత్ రెడ్డి వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఎల్జీబీ ఫార్ములా 4 కేటగిరీలో చిత్తేశ్ (డార్క్డాన్ రేసింగ్), రోహిత్ ఖన్నా (డార్క్ డాన్ రేసింగ్), రఘుల్ రంగసామి (ఎంస్పోర్ట్)... సుజుకి గిజ్జర్ కప్ విభాగంలో జోసెఫ్ (చెన్నై), సంజీవ్ (ముంబై), లల్మావిపువియా (ఐజ్వాల్)... రెడ్‌బుల్ రికీ కప్‌లో జాడెన్ గుణవర్దెనా, లాల్హురియజెలా, లాల్నన్సంగ వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు.