
సాక్షి, హైదరాబాద్: యూరో జేకే–17 ఫార్ములా రేసింగ్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు. వరుసగా రెండోసారి విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ఈ రేసును అనిందిత్ 2ని.4.792 సెకన్లలో పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచాడు.
నయన్ సి చటర్జీ, విష్ణు ప్రసాద్ వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. ఇప్పటివరకు అనిందిత్ పోలో వెంట్ చాంపియన్‌షిప్‌ను ఒకసారి... ఎంఆర్‌ఎఫ్–బీఎండబ్ల్యూ చాంపియన్‌షిప్, జేకే టైర్స్ చాంపియన్‌షిప్‌లను రెండుసార్లు చొప్పున గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment